గేమ్ ఛేంజర్.. టార్గెట్ ఎంతంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోలోగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Update: 2025-01-07 05:10 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోలోగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఆ సినిమా.. తెలుగు, తమిళం, హిందీలో జనవరి 10వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందించిన గేమ్ ఛేంజర్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహించారు. సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేశారు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని, తాను- శంకర్ కమ్ బ్యాక్ ఇస్తామని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.

అయితే గేమ్ ఛేంజర్ ను దిల్ రాజు.. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.400-450 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నార్త్ లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉందని చెబుతున్నారు. మౌత్ టాక్ బాగుంటే గానీ అక్కడ అంత మొత్తంలో వసూలు చేయడం సవాలేనని అంటున్నారు. పుష్ప 2 సినిమా మాదిరి హిందీ బెల్ట్ లో విజృంభిస్తే భారీ వసూళ్లను గేమ్ ఛేంజర్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా గేమ్ ఛేంజర్ మంచి పనితీరు కనబరచాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.130 కోట్లు వసూళ్లు చేయాలని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి పండగ సీజన్, రామ్ చరణ్ స్టార్‌ డమ్, శంకర్ స్టోరీ టెల్లింగ్ కలిసి వస్తే.. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తవ్వడం ఈజీ.

ఇక గేమ్ ఛేంజర్ విషయానికొస్తే.. రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకాంత్, నాజర్, సునీల్, సముద్రఖని, ఎస్ జే సూర్య తదితర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News