'గేమ్ ఛేంజ‌ర్' పాట‌ల కోస‌మే 90 కోట్లా?

స‌న్నివేశాల కోసం వేసే భారీ సెట్ల నుంచి పాట‌ల కోసం ప్ర‌త్యేకంగా నిర్మించే సెట్లు.. .సాంకేతిక నిపుణులు, విఎఎఫ్ ఎక్స్ వ‌ర్క్ ఇలా ప్ర‌తీది కోట్ల రూపాయలతో ముడిప‌డిన వ్య‌వ‌హార‌మే.

Update: 2024-12-25 09:28 GMT

ద‌ర్శ‌కుడు శంక‌ర్ సినిమా అంటే భారీ త‌నానికి పెట్టింది పేరు. ఇండియాలో మ‌రే డైరెక్ట‌ర్ ఆయ‌న స్కేల్ లో సినిమాలు చేయ‌లేరు. ఎలాంటి క‌థైనా బ‌డ్జెట్ విష‌యంలో శంక‌ర్ ఏమాత్రం రాజీ ప‌డ‌రు. ప్ర‌తీ ప్రేమ్ లోనూ ఆ భారీత‌నం క‌నిపిస్తుంది. స‌న్నివేశాల కోసం వేసే భారీ సెట్ల నుంచి పాట‌ల కోసం ప్ర‌త్యేకంగా నిర్మించే సెట్లు.. .సాంకేతిక నిపుణులు, విఎఎఫ్ ఎక్స్ వ‌ర్క్ ఇలా ప్ర‌తీది కోట్ల రూపాయలతో ముడిప‌డిన వ్య‌వ‌హార‌మే.

ఆయ‌న సినిమాలు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులంటే విఎఫ్ ఎక్స్ ప‌నులు ప్ర‌త్యేకంగా హాకాంగ్ లాంటి విదేశాల్లో నిర్వ‌హి స్తుంటారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చు కూడా అతి భారీగా ఉంటుంది. సినిమాల్లో అత‌డు వాడే టెక్నాల‌జీ కూడా అంతే అడ్వాన్స్ గా ఉంటుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న బెడితే పాట‌ల కోసం ఆయ‌న నిర్మించే సెట్ల కోస‌మే కోట్ల రూపాయు ఖ‌ర్చు చేస్తారు. సినిమాలో ఆరు పాట‌లుంటే? ఆయ‌న సెట్ నిర్మాణం చూస్తే బ్ర‌హ్మాండ‌మే బ‌ద్ద‌ల‌వుతుందా? అన్న‌ట్లు గా ఉంటుంది.

ఇప్ప‌టికే `గేమ్ ఛేంజ‌ర్` లో కొన్ని పాట‌ల సెట్ వ‌ర్క్ చూస్తే మ‌తిపోతుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాట లున్నాయి. ఈ పాట‌ల కోసమే 92 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని స‌మాచారం. ఆ విష‌యంలో నిర్మాత దిల్ రాజ్ ల‌క్కీ. సాధార‌ణంగా శంక‌ర్ సినిమా పాట‌ల కోసమే 100 కోట్లు చేస్తారు. కానీ `గేమ్ ఛేంజ‌ర్` నిర్మాత కోసం 8 కోట్లు సేవ్ చేసారుట‌. అయితే సినిమాలోని ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన `నా నా హైరానా` పాటలన్నింటిలోకి అత్యంత ఖరీదైన పాట.

మేకర్స్ ఈ పాటను న్యూజిలాండ్‌లో కొన్ని రోజుల పాటు చిత్రీకరించారు. దీనికి కెమారా ఖ‌ర్చు భారీగా అయింది. దాదాపు 18 కోట్ల‌కుపైగా ఈ పాట కోసమే ఖ‌ర్చు చేసిన‌ట్లు వినిపిస్తుంది. మిగ‌తా పాట‌ల‌న్నింటికి క‌లిపి 70 కోట్ల‌కు పైగా వెచ్చించిన‌ట్లు తెలుస్తోంది. ఈ పాటల‌న్నీ ప్రేక్ష‌కుల్ని త‌ప్ప‌క మెప్పిస్తాయ‌నే న‌మ్మ‌కంతో యూనిట్ క‌నిపిస్తుంది. ఏపాట‌కు ఆ పాట ప్ర‌త్యేక‌త ఉంటుంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News