'గేమ్‌ ఛేంజర్‌' టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ డేట్‌, ప్లేస్ ఫిక్స్‌

రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు.

Update: 2024-11-05 05:25 GMT
గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ డేట్‌, ప్లేస్ ఫిక్స్‌
  • whatsapp icon

రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా కోసం ప్రేక్షకులు దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి వస్తుందని భావించిన గేమ్‌ ఛేంజర్‌ ఏకంగా ఏడాది ఆలస్యం అయ్యి 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్‌ ప్యాచ్ వర్క్ మినహా దాదాపుగా పూర్తి అయిందని నిర్మాత దిల్‌ రాజు కాంపౌండ్ నుంచి సమాచారం అందుతోంది. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చి మంచి స్పందన దక్కించుకుంది. ఇక టీజర్‌ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో పాటు షూటింగ్‌ పూర్తి కావడంతో టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. సాధారణంగా టీజర్‌ను సింపుల్‌గా రిలీజ్ చేస్తారు. కానీ ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో ఇప్పటి నుంచే ప్రమోట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో చెన్నై లేదా లక్నో లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ ను ప్లాన్‌ చేశారు. చివరకు లక్నోలో టీజర్‌ ను విడుదల చేసేందుకు నిర్ణయించారని సమాచారం అందుతోంది. లక్నోలో భారీగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు, బాలీవుడ్‌ కి చెందిన ప్రముఖ స్టార్‌ ను ఆహ్వానించి ఆ కార్యక్రమంలో టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

దర్శకుడు శంకర్‌ ఇప్పటికే టీజర్‌ కి సంబంధించిన వర్క్ పూర్తి చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ లో చిన్న చిన్న మార్పులు ఉంటే వాటికి సంబంధించిన వర్క్‌ జరుగుతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీపావళికి విడుదల చేయాలి అనుకున్న టీజర్ మరీ ఆలస్యం కాకుండా ఈనెల 9న విడుదల చేయబోతున్నారు. లక్నో ఈవెంట్‌ కి తెలుగు మీడియాను సైతం తీసుకు వెళ్లే ఆలోచన ఉందని తెలుస్తోంది. అదే ఈవెంట్‌ లో హిందీ టీజర్‌తో పాటు తెలుగు, తమిళ ఇతర భాషల టీజర్‌లను విడుదల చేయడం ద్వారా ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచబోతున్నారు.

సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్‌ చేసే విధంగా విడుదలకు ముందే ఈవెంట్స్ నిర్వహించాలని దిల్‌ రాజు కాంపౌండ్‌ ప్లాన్‌ చేసింది. సినిమాకు అన్ని ఏరియాల్లోనూ మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రికార్డ్‌ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీజర్ విడుదల తర్వాత ప్రస్తుతం ఉన్న నెంబర్స్ మరింతగా పెరిగినా ఆశ్చర్యం లేదని మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్ డ్యూయెల్‌ రోల్‌ లో కనిపించబోతున్న ఈ సినిమాలో తండ్రి పాత్రకు అంజలి, కొడుకు పాత్రకు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్స్‌ గా నటిస్తోంది. సినిమాలో ఒక మంచి సోషల్‌ మెసేజ్‌ తో పాటు కమర్షయల్‌ ఎలిమెంట్స్ ఉంటాయని మేకర్స్‌ హామీ ఇస్తున్నారు. శంకర్‌ మార్క్‌ సినిమా ఇది అని, ఆయన ఈ సినిమాతో తన పూర్వ వైభవం సొంతం చేసుకుంటారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News