గేమ్ ఛేంజర్.. ఇదే కంటిన్యూ అయితే ఇబ్బందే!

వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు.

Update: 2024-10-27 21:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమా వర్క్స్.. ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ మూవీ నుంచి పోస్టర్స్ తో పాటు రెండు సాంగ్స్ ను మాత్రమే మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. దసరా కానుకగా టీజర్ ను రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. ఇప్పుడు దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. టీజర్ కట్ ను ఇప్పటికే మేకర్స్ దాదాపు ఫినిష్ చేశారని, ఎవరూ ఊహించని రేంజ్‌ లో ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది.

టీజర్ లో మరో కొత్త సాంగ్ ను యాడ్ చేశారని, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. చరణ్ మరో గెటప్ రివీల్ చేస్తారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. టీజర్ రిలీజ్‌ డేట్‌ పై వీకెండ్‌ లోనే అధికారిక ప్రకటన రాబోతోందని టాక్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. టీజర్ అప్డేట్ కోసం అడుగుతున్నారు.

అదే సమయంలో గేమ్ ఛేంజర్ మేకర్స్ పట్ల పలువురు అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ఫీలింగ్స్ ను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇదే కంటిన్యూ అయితే.. మూవీకి ఉన్న ఆదరణపై ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు. అసలు మేకర్స్ ప్లాన్ ఏంటో చెప్పండని అంటున్నారు. టీజర్ కు సంబంధించిన అప్డేట్ ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. గేమ్ ఛేంజర్ ను భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా, టాలీవుడ్ అందం అంజలి.. ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శ్రీకాంత్, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్.. మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News