గేమ్ ఛేంజర్.. యూఎస్ టార్గెట్‌తో సాలిడ్ హైప్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం "గేమ్ ఛేంజర్"పై పెద్దగా అంచనాలు అయితే లేవు.

Update: 2024-10-08 14:28 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం "గేమ్ ఛేంజర్"పై పెద్దగా అంచనాలు అయితే లేవు. కానీ ఇది పూర్తిగా ఒక పొలిటికల్ డ్రామా సినిమా కావడంతో అభిమానుల్లో మాత్రం కొంతవరకు ఆసక్తి నెలకొంది. శంకర్ మార్క్ మేకింగ్, రామ్ చరణ్‌ నటన క్లిక్కయితే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ప్రమోషన్ మరియు బిజినెస్ వివరాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా "గేమ్ ఛేంజర్" సినిమాకి సంబంధించి యూఎస్ మార్కెట్ లో భారీ టార్గెట్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం యూఎస్ మార్కెట్‌లో 4.5 మిలియన్ డాలర్ల టార్గెట్‌తో థియేట్రికల్ రన్ కి సిద్ధం అవుతుందని సినీ వర్గాల సమాచారం. ఇది రామ్ చరణ్ కెరీర్‌లో సోలోగా హైయెస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు.

ఇది కేవలం యూఎస్ మార్కెట్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారీగా హైప్ క్రియేట్ అవుతుండటంతో, ఈ సినిమా రిజల్ట్ పై అందరి దృష్టి ఎక్కువైంది. "ఆర్ఆర్ఆర్" వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వస్తున్న సినిమా కావడంతో, ఫ్యాన్స్ లో భారీ ఆశలు ఉన్నాయి. అంతే కాకుండా, శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ఈ ప్రాజెక్టును పక్కాగా తీసుకొని, తన మార్క్ మేకింగ్‌తో అందరిని ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

అయితే, "గేమ్ ఛేంజర్" ఆడియన్స్ అంచనాలను ఎంత వరకు అందుకుంటుందో చూడాల్సి ఉంది. సినిమాపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా కనిపించనుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, నవీన్ చంద్ర నటిస్తున్నారు.

ఇక మ్యూజిక్ విషయంలో ఎస్ఎస్ థమన్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. ఇక యూఎస్ మార్కెట్ లో టార్గెట్ పెట్టిన 4.5 మిలియన్ డాలర్లను సినిమా సాధిస్తుందా లేదా అనేది సినిమాకు వచ్చిన రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక సినిమా అనుకున్నట్లే క్రిస్మస్ కు వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News