గేమ్ ఛేంజర్.. నెగెటివ్ వైబ్ లో బిగ్ ప్లాన్?

ఇక కనీసం థమన్ ద్వారా సాంగ్స్ తో ప్రమోషన్స్ అయినా పెంచాల్సిన బాధ్యత ఉంది.

Update: 2023-11-07 08:12 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమాను ఏ క్షణంలో మొదలుపెట్టాడో కానీ ఈ సినిమా హైపో క్రియేట్ చేయడం కంటే కూడా అంచనాలను అంతకంతకూ తగ్గిస్తూనే ఉంది. సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడం మేజర్ మైనస్ పాయింట్ అయితే దర్శకులు శంకర్ వలన చాలా రకాల నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఎంతవరకు ఫినిష్ అయ్యింది అనే విషయంలో ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు.

అసలు సినిమాను స్టార్ట్ చేసినప్పుడు ఈపాటికి విడుదల చేయాలని కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ టార్గెట్స్ ఎన్ని క్రియేట్ చేస్తున్న కూడా సినిమా షూటింగ్ మాత్రం ఫినిష్ కావడం లేదు. ఇక కనీసం థమన్ ద్వారా సాంగ్స్ తో ప్రమోషన్స్ అయినా పెంచాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇటీవల కాలంలో రొటీన్ ట్యూన్స్ తో ఉన్న బజ్ తగ్గిస్తున్నాడు అనేలా కామెంట్స్ కూడా వస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ నుంచి ఇటీవల విడుదలైన జరగండి సాంగ్ అంతగా బజ్ క్రియేట్ చేయలేదు. అంతే కాకుండా చాలా రకాల ట్రోల్స్ కూడా వచ్చాయి. అసలు ఏమాత్రం ఫర్ఫెక్ట్ గా అనిపించని లిరిక్స్ తోనే డిసప్పాయింట్ చేస్తున్నారు అనే విధంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. అయినప్పటికీ చిత్ర యూనిట్ అదే పాటను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

తప్పకుండా మెల్లమెల్లగా సాంగ్ నచ్చుతుంది అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అంతే కాకుండా ఆ పాటను పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా విడుదల చేయాలని కూడా అనుకుంటున్నారు. అందుకోసం దర్శకుడు శంకర్ ఎప్పటిలానే గట్టిగా ఖర్చు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్ గతంలో కూడా తన సినిమాల పాటలను కూడా గ్రాండ్ గానే విడుదల చేయించారు.

ఇప్పుడు జరగండి పాటను కూడా తెలుగు హిందీ తమిళంలో అందరికీ చేరువయ్యేలా చేయాలని ఒక ఈవెంట్ ద్వారా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక దిల్ రాజు కూడా శంకరం ఆలోచన తగ్గట్టుగానే ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం అనుకున్న ప్లాన్ ప్రకారం సినిమా షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేస్తే బెటర్ అని అభిప్రాయాలు వస్తున్నాయి.

Tags:    

Similar News