రేణు దేశాయ్ మరో షాకింగ్ పోస్ట్.. అసలెందుకిలా?
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్, పిల్లలపై ప్రేమ, జంతువుల సంక్షేమంపై ఆసక్తిని పంచుకుంటూ ఉంటుంది.
టాలీవుడ్లో హీరోయిన్ గా కొనసాగింది చాలా తక్కువకాలమే అయినా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ బద్రి సినిమా అనంతరం ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ తరువాత పరిణామాల అనంతరం ఆమె ఇద్దరి ఇద్దరు పిల్లలకు తల్లిగా తనదైన లైఫ్ స్టైల్ ను కొనసాగిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్, పిల్లలపై ప్రేమ, జంతువుల సంక్షేమంపై ఆసక్తిని పంచుకుంటూ ఉంటుంది.
ఇటీవల, ఒక ఎన్జీవో ప్రారంభించనున్నట్లు ప్రకటించిన రేణు, జంతువుల రక్షణకు తన వంతు సహాయాన్ని అందిస్తోంది. సమాజంలోని సమస్యలపై గళమెత్తడం, అవసరమైతే అభిమానుల్ని కూడా సహాయానికి కోరడం రేణుకు ప్రత్యేకత. అయితే, తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సెలైన్ ఎక్కించుకుంటున్న వీడియోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. "ఆధునిక వైద్యశాస్త్రం మన శరీరాన్ని బతికిస్తూ ఉంచుతుంది" అనే క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేసిన ఆమె, ఈ సెలైన్ ఎందుకు ఎక్కించుకుంటోంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రేణుకు ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆమె ఆరోగ్యం గురించి చర్చలకు దారితీస్తోంది. అయితే సెలైన్ నిజంగా రేణు దేశాయ్ కు పెట్టిందేనా లేక మరోకరికి సంబంధించినదా అనేది తెలియదు. ఈ విషయంలో ఎన్ని కథనాలు వస్తున్నా కూడా ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.
ఇక రీసెంట్ గా రేణు దేశాయ్ బిగ్ స్క్రీన్ కు రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక పాజిటివ్ రోల్ పోషించిన ఆమెకు ఇండస్ట్రీలో చాలా రకాల ఆఫర్స్ వస్తున్నాయి. కానీ రెగ్యులర్ రోల్స్ కాకుండా తనకు సెట్టయ్యే పాత్రలను మాత్రమే చేయాలని చూస్తోంది. మహారాష్ట్రలో పూణెలో 1981లో జన్మించిన రేణు, మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి, తర్వాత నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎదిగింది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌తో నటించిన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాతోనే పవన్, రేణు మధ్య ప్రేమ పెరిగి పెళ్లి వరకు వెళ్లింది తర్వాత ఇద్దరూ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కానీ, కొన్ని వివాదాల కారణంగా విడిపోయారు. అయితే ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్‌లు, ప్రత్యేకించి ఈ సెలైన్ వీడియో, అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక రేణు దేశాయ్ ఈ విషయంపై మరింత స్పష్టత ఇస్తే అందరూ ఊరట పొందే అవకాశం ఉంటుందని ఫాలోవర్స్ స్పందిస్తున్నారు.