గేమ్ ఛేంజర్ రిలీజ్.. ఇంకా ఆలస్యమే..
ఏది ఏమైనా కూడా ఛేంజర్ సినిమా విషయంలో అప్డేట్ ఇచ్చిన కొన్ని రోజులకే మళ్ళీ ట్విస్ట్ అయితే ఇస్తున్నారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా విడుదలపై చాలా రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు మొత్తానికి నిర్మాత దిల్ రాజు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అసలైతే ఈపాటికే ఫినిష్ కావాలి. కుదిరితే దసరా సమయంలో కూడా విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఆ డేట్ మిస్ అయిన తర్వాత 2024 సంక్రాంతికి తప్పకుండా వస్తారు అని అనిపించింది.
కానీ ఫ్యాన్స్ ఎదురుచూపులకు మాత్రం ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ షాక్ ఇస్తూనే ఉంది. దర్శకుడు శంకర్ ఆగిపోయిన తన మునిపటి చిత్రం ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను మళ్లీ రీస్టార్ట్ చేయడంతో గేమ్ ఛేంజర్ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయాల్సిన సినిమా కూడా మరింత ముందుకు వెళ్ళింది.
ఏది ఏమైనా కూడా ఛేంజర్ సినిమా విషయంలో అప్డేట్ ఇచ్చిన కొన్ని రోజులకే మళ్ళీ ట్విస్ట్ అయితే ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా నిర్మాత దిల్ రాజు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఒక మాస్ థియేటర్లో ఆడియన్స్ తో కలిసి సలార్ సినిమా చూసిన దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు విడుదల అని మీడియా అడగక ఆయన వెంటనే సమాధానం ఇచ్చేశారు.
ఆ సినిమా 2024 సెప్టెంబర్ లో వస్తుంది అని క్లారిటీ ఇచ్చారు. అంటే మరో ఆరు నెలలకు పైగా అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే సినిమా షూటింగ్ అయితే ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది. ఈ నెల చివరలో ఒక మూడు రోజుల షెడ్యూల్ ఫినిష్ చేయబోతున్నారు.
మళ్లీ న్యూ ఇయర్ కోసం బ్రేక్ తీసుకొని కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అనంతరం మొత్తానికి 2024 మార్చి నెలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేలా దిల్ రాజు ఒక ప్రణాళిక రచించుకున్నారు. అలాగే మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా షూటింగ్ ను 2024 ఏప్రిల్ లో స్టార్ట్ చేయనున్నారు.