గేమ్ ఛేంజర్.. ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదు

భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ కూడా రాలేదు.

Update: 2024-02-28 06:21 GMT

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూడేళ్లుగా గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 10 రోజుల పాటు కీలక షెడ్యూల్ పూర్తి చేశారు మేకర్స్. అందుకు సంబంధించిన హెలికాఫ్టర్ సీన్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ.. సెప్టెంబర్ లో రిలీజ్ అవుద్దని కొన్ని రోజుల క్రితం దిల్ రాజు ఓ కార్యక్రమంలో చెప్పారు.

కానీ ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. దాంతోపాటు టీజర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీపై తాజాగా ఓ క్లారిటీకి వచ్చేశారట.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన గేమ్ ఛేంజర్ మూవీని రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చేసిందట. అయితే డిసెంబర్ 25న బుధవారం.. అంటే లాంగ్ వీకెండ్ ను దృష్టిలో ఉంచుకునే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్, ఆ తర్వాత వీకెండ్, అనంతరం న్యూ ఇయర్.. గేమ్ ఛేంజర్ క్లిక్ అయితే మాత్రం వరుసగా వారం రోజులపాటు స్ట్రాంగ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇక, ఈ సినిమాలో రామ్‍ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు అందం అంజలి, ఎస్ జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని దిల్‍రాజు నిర్మిస్తున్నారు. అయితే డైరెక్టర్ శంకర్.. ఇండియన్ 2 సినిమా కూడా తెరకెక్కిస్తుండటంతో పాటు మరిన్ని కారణాల వల్ల గేమ్ ఛేంజర్ ఆలస్యమవుతూ వస్తోంది. మరి ఇప్పటికైనా రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News