గేమ్ ఛేంజర్.. మళ్ళీ మొదటికొచ్చే..

అయినప్పటికీ సాంగ్ విడుదల చేసిన తర్వాత మెల్లగా అదే ఎక్కుతుంది అన్నట్లుగా ఆలోచించి ప్రమోషన్ స్టార్ట్ చేయాలని అనుకున్నారూ.

Update: 2023-11-10 14:30 GMT

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనగానే ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఆనందపడ్డారు. శంకర్ ఫామ్ లో లేకపోయినప్పటికీ కూడా తప్పకుండా మెగా పవర్ స్టార్ తో మంచి సందేశం ఉన్న సినిమాను అందిస్తాడు అని అనుకున్నారు. దాంతోపాటు దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నాడు అంటే తప్పకుండా కంటెంట్ చాలా బలంగానే ఉండి ఉంటుంది అని కూడా ఆశలు పెంచుకుంటున్నారు.

అయితే ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా మాత్రం గేమ్ ఛేంజర్ పనులు ముందుకు కొనసాగడం లేదు. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో అయితే అసలు ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. సినిమా ఎంతవరకు వచ్చింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే విషయాలు చాలా సస్పెన్స్ గా మారిపోయాయి. శంకర్ మరొకవైపు ఇండియన్ 2 ప్రాజెక్టును కొనసాగిస్తూ ఉండడం వల్లనే గేమ్ ఛేంజర్ విషయంలో చాలా గందరగోళం నెలకొంది.

అయితే సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేవరకు ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసే అవకాశం లేదని అనిపిస్తుంది. అసలైతే ఈ దీపావళికి జరగండి అనే ఒక పాటను విడుదల చేయాలని అనుకున్నారు. ఆ పాట ముందుగానే సోషల్ మీడియాలో కూడా లీక్ అయింది. ఇక ఆ పాట ఏ మాత్రం అసలు బాగాలేదు అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

అయినప్పటికీ సాంగ్ విడుదల చేసిన తర్వాత మెల్లగా అదే ఎక్కుతుంది అన్నట్లుగా ఆలోచించి ప్రమోషన్ స్టార్ట్ చేయాలని అనుకున్నారూ. కానీ ఇప్పుడు మళ్లీ ఏమైందో ఏమో కానీ దీపావళికి అసలు సాంగ్ విడుదల చేసే అవకాశం లేదని అనిపిస్తుంది. మరి కొన్ని గంటల్లో దీపావళి మొదలు కానుంది. కానీ ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఎలాంటి సౌండ్ రావడం లేదు.

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా విడుదల విషయంలో ఒక క్లారిటీ వచ్చేవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకూడదు అని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారి రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే దాన్నిబట్టి ఒక్కొక్క అప్డేట్ తో హైప్ పెంచడానికి అవకాశం ఉంటుంది. మళ్లీ రిలీజ్ డేట్ కు ఇప్పుడు రిలీజ్ చేసే సాంగ్స్ కు పెద్దగా గ్యాప్ వస్తే సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆలోచిస్తున్నారట. అసలే లీక్స్ వలన నెగిటివ్ కామెంట్స్ అందుకున్న జరగకండి పాట ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో తెలియదు. మరి ఈ విషయంలో దిల్ రాజు టీం దీపావళి రోజు ఏదైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News