గాండీవధారి అర్జున.. బడ్జెట్ ఓకే కానీ బజ్ ఎక్కడ?
వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది
వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమా ఒక స్పై యాక్షన్ మూవీ గా రాబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇంతకుముందు విడుదల చేసిన పోస్టర్లు అలాగే టీజర్, ట్రైలర్స్ అన్నిటిలో కూడా సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉన్నట్లుగా హైలెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
వరుణ్ తేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా ది ఘోస్ట్ సినిమాతో ఇంతకుముందు డిజాస్టర్ అందుకున్నాడు. కాబట్టి ఈ సినిమాతో అతను కూడా సక్సెస్ అందుకొని తదుపరి సినిమాను బిగ్ హీరోతో చేయాలి అని అనుకుంటున్నాడు.
ఇక ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య కూడా ఈ సినిమాతోనే సరికొత్తగా కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో అయితే బజ్ పెరగడం లేదు. సినిమాకు వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ కు మించి 55 కోట్ల రేంజ్ లో ఖర్చు చేశారు అని కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని బడ్జెట్ అయితే అంతకంటే తక్కువగానే అయింది అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల నుంచి మరొక క్లారిటీ వచ్చింది.
ఇక బడ్జెట్ అయితే దాదాపు 40 కోట్ల రేంజ్ లోనే ఖర్చు అయినట్లుగా సమాచారం. అంత బడ్జెట్ అంటే కూడా మామూలు విషయం కాదు. వరుణ్ తేజ్ చివరి మూడు సినిమాలు చూసుకుంటే 30 కోట్ల ప్రాఫిట్ కూడా అందించలేకపోయి. ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఏ సినిమాతో కూడా అందులో సగం షేర్ కలక్షన్స్ కూడా అందుకోలేకపోయాడు.
కాబట్టి ఈ కాంబినేషన్ పై చిత్ర నిర్మాణ సంస్థ 40 కోట్లు పెట్టడం కూడా పెద్ద రిస్క్ అని తెలుస్తోంది. కంటెంట్ ను నమ్ముకుని సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యే విధంగా అప్డేట్స్ ఇస్తున్నారు అంటే అది లేదు. ఇప్పుడు కేవలం విడుదల తర్వాత కంటెంట్ తోనే మొదట ద్వారా జనాలను అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి కంటెంట్ తో ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.