డిసెంబర్ రేసులో గోదావరి గ్యాంగ్.. టఫ్ ఫైట్ షురూ..!

క్రేజీ సినిమాలతో దూకుడు మీదున్న విశ్వక్ సేన్ సినిమా సినిమాకు తన స్టామినా పెంచుకుంటూ వస్తున్నాడు

Update: 2023-08-01 01:30 GMT

యువ హీరోల్లో వరుస క్రేజీ సినిమాలతో దూకుడు మీదున్న విశ్వక్ సేన్ సినిమా సినిమాకు తన స్టామినా పెంచుకుంటూ వస్తున్నాడు. 10 సినిమాల కెరీర్ లో తన గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్న విశ్వక్ సేన్ లేటెస్ట్ గా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గా టైటిల్ పెట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ ఓ రేంజ్ లో ఉన్నట్టు అర్ధమవుతుంది.

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ టీజర్ శాంపిల్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు దర్శక నిర్మాతలు. రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అంజలి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. సినిమాలో విశ్వక్ సేన్ లుక్ అదిరిపోయింది. అయితే ఫస్ట్ లుక్ టీజర్ లో సినిమా డిసెంబర్ లో రిలీజ్ అని అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ అనగానే క్రిస్మస్ రేసులో సినిమా దిగుతుందని అనుకుంటున్నారు.

అయితే ఆల్రెడీ క్రిస్మస్ రేసులో నాని హాయ్ నాన్న, వెంకటేష్ సైంధవ్ రిలీజ్ ఫిక్స్ చేశారు. వీరికి పోటీగా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రాబోతుందని టాక్. నాని సినిమా క్లాస్.. వెంకటేష్ సినిమా యాక్షన్ గా వస్తుండగా.. విశ్వక్ సేన్ గోదావరి గ్యాంగ్ మాత్రం మాస్ మూవీగా రాబోతుంది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ తన మాస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. విశ్వక్ సేన్ రఫ్ లుక్ సినిమాలో అతని యాటిట్యూడ్ ని తెలియచేస్తుంది.

కృష్ణ చైతన్య ఈ సినిమా కోసం కొన్నాళ్లుగా వర్క్ చేస్తున్నారు. సినిమా స్క్రిప్ట్ దశలోనే అదిరిపోగా ఇప్పటివరకు తీసిన రష్ కూడా బాగా వచ్చిందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ హ్యాండ్ కూడా ఉందని టాక్. ఆల్రెడీ కృష్ణ చైతన్య రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగ సినిమాలు చేశాడు. రౌడీ ఫెలో సినిమా ఇప్పటికీ ఆడియన్స్ ని అలరిస్తుంది. ఛల్ మోహన్ రంగ సినిమా నిరాశపరచింది. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాత్రం తప్పకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News