గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. మూడు రోజుల్లో వచ్చింది ఎంతంటే..
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. "ఛల్ మోహన రంగ" ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విశ్వక్ లంకల రత్నగా మెరిసారు. ఊర మాస్ క్యారెక్టర్ లో విశ్వక్ తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేశారు. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ ఎదుగుతున్నారు.
2024లో విశ్వక్ "గ్యామి" మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో అఘోర శంకర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. 2023లో "దాస్ కా దమ్కీ" సినిమాతో కూడా విశ్వక్ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా విడుదలకు ముందే అప్డేట్స్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసుకుంది.
ఈ మూవీ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.8.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. విశ్వక్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక మూడు రోజుల్లో ఏపీ తెలంగాణ లో మంచి వసూళ్ళను రాబట్టింది. మొత్తంగా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.62 కోట్ల షేర్ అందుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్లు. అంటే దాదాపు 82 శాతం రికవరీ అయ్యింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం వీకెండ్ అనంతరం రోజు కూడా డీసెంట్ వసూళ్లనే రాబట్టే అవకాశం ఉంది. సోమవారం తరువాత కూడా ఇదే జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. "డీజే టిల్లు" ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, అంజలి కీలక పాత్ర పోషించింది.
బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లో విడుదలైన మూడు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కథ విషయానికొస్తే, లంక గ్రామానికి చెందిన లంకల రత్న ఒక చిన్న స్థాయి నుంచి మరో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనుకుంటాడు. తన ప్రాంతానికి చెందిన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ఓ వర్గం వైపు చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. ఆ తర్వాత కథ ఇంట్రెస్టింగ్ మలుపులు తిరుగుతుంది. అతని ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.