కల్కి 2898.. ఆ పాత్రలపై గరికపాటి సెటైర్
సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మహారభారతంలో లేని అంశాలు కల్పించి చూపించారనే కామెంట్స్ వచ్చాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంది. ఈ ఏడాది ఇండియాలో హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కల్కి’ మూవీ నిలిచింది. అయితే ఈ సినిమాని సామాన్య ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. ఇతిహాసాలు గురించి తెలిసిన వారు, హిందుత్వ సంఘాలు మాత్రం మూవీ పైన తీవ్ర విమర్శలు చేశారు.
సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మహారభారతంలో లేని అంశాలు కల్పించి చూపించారనే కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా కర్ణుడి క్యారెక్టర్ ని హీరోగా రిప్రజెంట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. మహాభారతంలో అర్జునుడి కంటే కర్ణుడు మహా వీరుడిగా ప్రెజెంట్ చేశారు. కృష్ణుడి క్యారెక్టర్ తో కూడా కర్ణుడి గొప్పతనం గురించి డైలాగ్ చెప్పించారు.
అలాగే అశ్వద్ధామని కాపాడటానికి కర్ణుడు జన్మించినట్లు మూవీ క్లైమాక్స్ లో చిత్రీకరించారు. దీనిపై చాలా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. భవిష్యపురాణం, కల్కి పురాణంలో కర్ణుడి గురించి ప్రస్తావన లేకపోయిన సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చెప్పడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి ‘కల్కి2898ఏడీ’ సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణుడు ఎవరో తెలియకపోతే ‘కల్కి’ సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. సినిమా వాళ్ళు ఏది చూపిస్తే అదే నిజం అనుకుంటున్నాం.
మొత్తం భారతంలో ఉన్నది వేరు ‘కల్కి’లో చూపించింది వేరు. అశ్వద్ధామ, కర్ణుడు అర్జెంట్ గా హీరోలు అయిపోయారు. అర్జునుడు, కృష్ణుడు విలన్ లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్ధం కావట్లేదు. భారతం మొత్తం చదివితే అసలు కథ ఏంటనేది అర్ధమవుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిని అశ్వద్ధామ కాపాడాడు. అశ్వద్ధామని కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే అశ్వద్ధామ మహావీరుడు.
సినిమాలో ఆచార్య పుత్ర ఆలస్యమైనదా అనే డైలాగ్ పెట్టారు. అది ఎలా వచ్చిందో అర్ధం కాదు. ఏది కావాలంటే అది పెట్టేయడమే. 1000 రూపాయిలు ఎక్కువ ఇస్తే డైరెక్టర్ ఏది కావాలంటే అది రాసేస్తారు అంటూ తీవ్రంగా విమర్శించారు. ‘కల్కి2898ఏడీ’ కథలోని క్యారెక్టరైజేషన్స్ పై హిందూత్వ సంఘాలు విమర్శలు చేసిన అవి పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. సినిమా రిలీజ్ సమయంలో వచ్చిన విమర్శలకి నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే గరికపాటి చేసిన విమర్శలకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏమైనా రియాక్ట్ అవుతారా అనేది ఇప్పుడు వేచి చూడాలి.