తన కంపెనీకి పోటీగా మారిన అతడిని కొనేసిన హీరో గారి భార్య !
తాజాగా ఇంటీరియర్ డిజైనింగ్ పరిశ్రమ ప్రముఖురాలైన గౌరీఖాన్ ఓ యువ పారిశ్రామికవేత్త కంపెనీతో టై అప్ పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇంటీరియర్ డిజైనింగ్ గృహోపకరణాలు భారతదేశంలో పెరుగుతున్న పరిశ్రమలలో ఒకటి. ఈ రంగంలో దశాబ్ధాల సుదీర్ఘ అనుభవంతో షారూఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ పేరు ఎల్లపుడూ మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. బాలీవుడ్ లోని ప్రముఖ స్టార్లు, దర్శకనిర్మాతల ఇండ్లకు, అలాగే ప్రముఖ రాజకీయనాయకుల ఇండ్లకు గౌరీనే డిజైనర్.
తాజాగా ఇంటీరియర్ డిజైనింగ్ పరిశ్రమ ప్రముఖురాలైన గౌరీఖాన్ ఓ యువ పారిశ్రామికవేత్త కంపెనీతో టై అప్ పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంటీరియర్ పరిశ్రమలో పోటాపోటీగా ఎదుగుతున్న వారిలో ఒకరు ప్రాంజల్ అగర్వాల్. అతడు విలాసవంతమైన స్పానిష్ ట్విస్ట్‌తో తన సొంత మేడ్-ఇన్-ఇండియా ఫర్నిచర్ కంపెనీని స్థాపించాడు. ప్రాంజల్ అగర్వాల్ ముంబైలో ఉన్న ఫర్నీచర్ - గృహాలంకరణ సంస్థ అయిన 'హెర్మోసా డిజైన్ స్టూడియో' వ్యవస్థాపకుడు, CEO.అగర్వాల్ 2018లో హెర్మోసా డిజైన్‌ను కేవలం 25 సంవత్సరాల వయస్సులో ప్రారంభించాడు.
ప్రతి సంవత్సరం తన బ్రాండ్‌ను మరో స్థాయికి తీసుకువెళుతున్నాడు. ప్రాంజల్ తన బ్రాండ్ డిజైనర్ ఫర్నిచర్‌ను సరసమైన ధరలలో అందిస్తుండడం అతడి ప్రత్యేకత. టార్గెట్ కొనుగోలుదారులు టైర్ 2 నగరాల్లో ఉన్నవారే. అతని బ్రాండ్ ప్రారంభించిన ఫర్నిచర్ దిగుమతి చేసుకున్న హై-ఎండ్ బ్రాండ్‌లతో సమానంగా డిజైనర్ ఫర్నిచర్ నాణ్యతను కలిగి ఉంది.
షారుఖ్ ఖాన్ భార్య ఇంటీరియర్ డెకర్ బ్రాండ్ 'గౌరీ ఖాన్ డిజైన్స్'కు హెర్మోసా ఫర్నిచర్ ఇటీవల తీవ్రమైన పోటీనివ్వడం ప్రారంభించింది. గౌరీఖాన్ డిజైన్స్ అనేక దశాబ్దాలుగా భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ హోమ్ డెకర్ - ఫర్నీచర్ బ్రాండ్‌లలో ఒకటిగా ఉంది. ఒక్కో వస్తువు ధర ఒక్కో మెటీరియల్‌ని బట్టి మారుతూ ఉంటుంది. హెర్మోసా డిజైన్‌లో విక్రయించే ఫర్నిచర్ వస్తువులల ధర రూ. 500 నుండి రూ. 1 లక్ష వరకు ఉంటుంది.
హెర్మోసా డిజైన్ ప్రతి సంవత్సరం రూ. 13 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఐదేళ్లలో రూ. 150 కోట్లకు పైగా వాల్యుయేషన్‌కు చేరుకుంది. ఇది దేశవ్యాప్తంగా కస్టమర్ల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించడంతో, ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ హెర్మోసా డిజైన్స్‌తో భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నారు. 2020లో తన కంపెనీ రెండవ వార్షికోత్సవం కోసం ప్రాంజల్ అగర్వాల్‌తో ఒక ప్రత్యేకమైన ప్రొడక్ట్ లైన్‌ను ప్రారంభించారు.