సాయి రాజేష్ పాము లాంటోడు! గాయ‌త్రి గుప్తా

సాయి రాజేష్ తెర‌కెక్కించిన 'బేబి' రిలీజ్ అనంత‌రం క‌థ విష‌యంపై వివాదం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే

Update: 2024-05-30 09:52 GMT

సాయి రాజేష్ తెర‌కెక్కించిన `బేబి` రిలీజ్ అనంత‌రం క‌థ విష‌యంపై వివాదం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. షార్ట్ ఫిలిం డైరెక్ట‌ర్ కం సినిమా సినిమాటోగ్రాఫ‌ర్ శిరిన్ శ్రీరామ్ బేబి క‌థ త‌న‌దంటూ ఆరోపించాడు. త‌న క‌థ‌ని కాపీ కొట్టి టైటిల్ మార్చి బేబి సినిమా గా తీసాడ‌ని, దీనికి సంబంధించి కొన్ని ఆధ‌రాల‌తో సాయి రాజేష్ పై `బేబిలీక్స్` అనే బుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఇందులో ఆ సినిమాకి సంబంధించిన కొన్ని ఆధారాలున్న‌ట్లు పేర్కొన్నారు.

తాజాగా ఇదే అంశంపై న‌టి గాయ‌త్రి గుప్తా స్పందించింది. `బేబి క‌థ‌ను `ప్రేమించొద్దు` అనే పేరుతో శ్రీరామ్ రాసుకున్నాడు. దాన్ని రాజేష్ కాపీ కొట్టాడు. ఇందులో హీరోయిన్ గా న‌న్నే అనుకున్నారు. దానికి సంబంధించిన ఆడీష‌న్ కూడా ఇచ్చాను. స్కూల్ డ్రెస్ లో ఉన్న ఆ ఫోటోను సాయి రాజేష్ కి చూపించాను. దాన్నే బేబిలో కాపీ కొట్టి పెట్టాడు. ఆ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక చూసి షాక్ అయ్యాను. సాయి రాజేష్ తో ఇబ్బందులు నాకు కొత్తేం కాదు. ఆయ‌న డైరెక్ట్ చేసిన కొబ్బ‌రిమ‌ట్ట‌లో న‌టించిన‌ప్పుడు ఇబ్బంది పెట్టాడు.

ఆ సినిమాకి మూడు ల‌క్ష‌లిస్తాన‌ని చెప్పి 25 వేలు చేతిలో పెట్టాడు. ఇప్పుడు బేబి క‌థ‌ని కూడా తానే రాసాన‌ని చెప్పుకుంటున్నాడు. శిరీన్ ..రాజేష్ ఇద్ద‌రు క‌లిసి తీద్దామ‌నుకు చివ‌ర్లో బడ్జెట్ లేద‌ని శిరీన్ ని త‌ప్పించాడు. అదే క‌థ‌ని కాపీ కొట్టి సొంతంగా తాను ఒక్క‌డినే చేసాన‌ని గీతా ఆర్స్ట్ లో చ‌ర్చ‌లు కూడా జ‌రిపాడు. ఆ సంస్థ చాలా మంచింది. కానీ పాములాంటి రాజేష్ ని వాళ్లు గుర్తించాలి. అత‌డి నిజ స్వ‌రూపం ఏంటో తెలుసుకోవాలి.

చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటాడు. బేబి పాత్ర‌ను చాలా దారుణంగా చూపించాడు. కొంద‌రైతే హీరోయిన్ పోస్ట‌ర్ ని చెప్పుల‌తో కూడా కొట్టారు. ఇదంతా కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం చేయించిన ప‌నులు. సాయి రాజేష్ టాలీవుడ్ కి ఓ మ‌చ్చ లాంటివాడు. వాస్త‌వంగా క‌థ‌ను రాసుకున్న శిరీన్ శ్రీరామ్ కి తగిన న్యాయం జ‌ర‌గాలి` అని అన్నారు.

Tags:    

Similar News