గీతాంజ‌లి అల్ల‌రి గిరిజ ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు..!

గిరిజ త‌న‌దైన‌ మార్క్ న‌ట‌నాభిన‌యం ఆకర్షణతో ఘాడ‌త ఉన్న పాత్రలో మ‌రిపించ‌నుంద‌ని స‌మాచారం.

Update: 2023-08-16 16:51 GMT

మణిరత్నం రొమాంటిక్ డ్రామా 'గీతాంజలి'లో మరపురాని పాత్రతో మ‌న‌సులో దోచిన గిరిజా షెట్టర్ ఆ త‌ర్వాత హృద‌యాంజ‌లి చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టించారు. అటుపై ఎన్ని అవ‌కాశాలు వ‌చ్చినా న‌ట‌న‌కు దూరంగా ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. చాలా కాలంగా గిరిజ ఏం చేస్తున్నారు? అంటూ యూట్యూబర్లు అన్వేష‌ణ సాగిస్తూనే ఉన్నారు. ఎట్ట‌కేల‌కు గిరిజ‌ మరోసారి మీడియా గ్లేర్ లోకి వ‌చ్చారు. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత ఆమె వెండితెరపైకి అనూహ్యంగా పునరాగమనం చేస్తోంది.

2002లో విడుద‌లైన‌ 'హృదయాంజలి'లో చివరిసారిగా కథానాయికగా కనిపించిన గిరిజా షెట్టర్ ఇప్పుడు చంద్రజిత్ బెల్లియప్ప దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం 'ఇబ్బని తబ్బిడ ఇలేయాలి'తో తిరిగి కంబ్యాక్ అవుతోంది. ఈ చిత్రంలో ఆమె మధుమిత అనే ఒంటరి తల్లి పాత్రను పోషిస్తోంది. గిరిజ త‌న‌దైన‌ మార్క్ న‌ట‌నాభిన‌యం ఆకర్షణతో ఘాడ‌త ఉన్న పాత్రలో మ‌రిపించ‌నుంద‌ని స‌మాచారం.

ఈ చిత్రంలో విహాన్, అంకితా అమర్, మయూరి నటరాజా త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పరమవ స్టూడియోస్ పతాకంపై జీఎస్ గుప్తా, రక్షిత్ శెట్టి నిర్మిస్తున్నారు. గగన్ బదేరియా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

Tags:    

Similar News