జెనిలియాని మనోళ్లు అంత మాట అన్నారా?
కానీ నేను తెలుగు..తమిళ..మలయాళ భాషల్లో నటిస్తున్నప్పుడు బాలీవుడ్ నుంచి వచ్చి దక్షిణాది సినిమాలు చేస్తుంది అనేవారు
దక్షిణాది అభిమానులు హీరోయిన్లను ఎలా ఆదరిస్తారో చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రం..భాషతో సంబంధం లేకుండా తెరపై కనిపిస్తే చాలు గుండెల్లో పెట్టుకుని ఆరాదిస్తారు. హీరోయిన్లకు అవకాశాల రావడం వెనుక ప్రధాన కారణం కేవలం ఫాలోయింగ్ మాత్రమే. అది ఎలా సాద్యమైంది అంటే అభిమానం చూపించడం వల్లే సాధ్యమైంది. తెరపై కనిపించిన ప్రతీ ఒక్కరినీ అదరించడం అన్నది సౌత్ లో ఉన్న ప్రత్యేకత. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో అదే అభిమానం మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
నటుడు..నటి నచ్చారంటే? తమ బిడ్డల్లాగే ఆదరించేంత అభిమానం తెలుగు రాష్ట్రాల్ని మించి ఎక్కడా కనిపించదు. దినదినాన అభమానం పెరుగుతుందే తప్ప! తగ్గుతుంది అన్న సన్నివేశం ఎక్కడా చోటు చేసుకోలేదు.అందులోనూ జెనిలియాని తెలుగు అభిమానులు ఎంతగా ఆదరించారో తెలిసిందే. బొమ్మరిల్లు ఎంతో మంది హృదయాల్లో ఇల్లు కట్టిన అమ్మడికి ఇక్కడ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.
జెనిలియా అంతే హైహార్ట్ ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి అభిమానం పై జెనిలియా నీళ్లు జల్లేసింది. దక్షిణాది నటీనటులకు నమ్మకమైన అభిమానులుంటారు.
కానీ నేను తెలుగు..తమిళ..మలయాళ భాషల్లో నటిస్తున్నప్పుడు బాలీవుడ్ నుంచి వచ్చి దక్షిణాది సినిమాలు చేస్తుంది అనేవారు. ఎక్కడో నాపై చిన్న చూపు చూపించినట్లు అనిపించేది.
భాషా బేధం చూపించినట్లు నా మనసుకు చాలా సందర్భాల్లో అనిపించింది. అయినా సరే నాకు ఆ భాషల్లో సినిమాలు చేయడం ఇష్టం. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేసాను. వాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నాను.ఏ భాషలో సినిమాలు రిలీజ్ అయిన వాటిని భారతీయ చిత్రాలుగానే పరిగణిస్తాను. నాకు మాత్రం ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. అందర్నీ సమానంగా చూడటమే తెలుసంటూ చురకలు వేసింది.
మరి జెనీలియాకి సౌత్ అభిమానులు అంతగా ఏ సందర్భంలో నొప్పించారో. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత జెనిలియా కొన్నాళ్లకి నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలరు.