రీల్స్ లో అతి ఎక్కువైందా?

నాభి అందాల్ని చూపిస్తూ...వ‌య్యారంగా కెమెరా ముందు నానా హంగామా చేసారు. దీంతో ప్ర‌యాణికులు ఆగ్ర‌హించారు.

Update: 2023-11-27 00:30 GMT

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక సంపాద‌న‌కి అదొక వేదికైంది. ఎక్క‌డా ఉద్యోగం చేయ‌కుండా ఇంట్లో కూర్చునే సంపాదించుకునే వెసులు బాటు దొరికింది. ఫేస్ బుక్..ఇన్ స్టా గ్రామ్..ట్విట‌ర్..యూ ట్యూబ్ వంటి మాధ్య‌మాలు అందుకు ఆస‌ర‌గా క‌నిపిస్తున్నాయి. ఈ ప్లాట్ ఫాం ఆధారంగా రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ లైన వారెంతో మంది. ఇన్ స్టా రీల్స్ చేసి ఫేమ‌స్ అవుతున్నారు. త‌ద్వారా కొంత ఆదాయం స‌మ‌కూరుతుంది.

కంటెంట్ ప‌రంగా హ‌ద్దులు దాటుతున్న వారెంతో మంది ఉన్నారు. పోటీ వ‌రల్డ్ కావ‌డంతో! సెల‌బ్రిటీల్ని సైతం మించిపోతున్నారు కొంద‌రు గాళ్స్. ముఖ్యంగా ఇన్ స్టా గొప్ప ఆదాయ వ‌న‌రుగా మార‌డంతో ఈ ప్లాట్ ఫాంపై అతి ఎక్కువైంద‌నే విమ‌ర్శ‌లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. సైబ‌ర్ క్రైమ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఓవైపు పిలిచి కౌన్సింలింగ్ లు ఇస్తున్నా! అవి ఆ గ‌ది కే ప‌రిమిత మ‌వుతున్నాయి.

బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్లీ య‌ధావిధిగా త‌మ ప‌ని త‌మ‌దే అన్న‌ట్లు సన్నివేశం క‌నిపిస్తుంది. తాజాగా ఓ ఇద్ద‌రు యువ‌త‌లు తోటి ప్ర‌యాణికుల్ని ప‌ట్టించుకోకుండా డాన్స్ చేసిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇన్ స్టా వీడియో రీల్ కోసం సౌండ్ బిగ్గ‌ర‌గా పెట్టుకుని డాన్సు చేసారు. ఆ డాన్సులో యువ‌త అతి క‌నిపిస్తుంది. చుట్టూ పురుషులు ఉన్నారు? అన్న సంగ‌తి సైతం మ‌ర్చిపోయి ఇష్టాను సారం డాన్సులు చేసారు.

నాభి అందాల్ని చూపిస్తూ...వ‌య్యారంగా కెమెరా ముందు నానా హంగామా చేసారు. దీంతో ప్ర‌యాణికులు ఆగ్ర‌హించారు. త‌మ అసౌక‌ర్యాన్ని గుర్తించ‌కుండా ఇబ్బంది పెట్టార‌ని వారిపై రైల్వే శాఖ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆ వీడియో అన్ని మాధ్య‌మాల్లో వైర‌ల్ అవ్వ‌డంతో అంతా తిట్టి పోస్తున్నారు. ప‌ద్ద‌తిగా ఉండాల్సిన ఆడ‌పిల్ల‌లు ఇలా వీధుల్లో డాన్సులు చేయ‌డం ఏంటి? అని మండిప‌డుతున్నారు.

రీల్స్ కోసం ఎంత‌కైనా తెగిస్తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వ్య‌క్తిగ‌తం గా ఇంట్లోనో..ఎవ‌రూ లేని ప్రాంతాల్లో ఇలాంటి వీడియోలు చేస్తే ప‌ర్వాలేదు. కానీ ప‌బ్లిక్ గా ఇలాంటి వీడియోలు చేసే వారిపై అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. స‌మాజంలో ఇలాంటివి చెడుని మ‌రింత ప్ర‌భావితం చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News