గోపిచంద్ విశ్వం.. ప్రాఫిట్ లోకి వచ్చిందా లేదా?

మ్యాచో స్టార్ గోపీచంద్ మంచి కమర్షియల్ సక్సెస్ కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు.

Update: 2024-10-16 04:53 GMT

మ్యాచో స్టార్ గోపీచంద్ మంచి కమర్షియల్ సక్సెస్ కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏ మూవీ కూడా అతనికి సరైన బ్రేక్ ఇవ్వలేదు. మాస్ హీరోగా గోపీచంద్ కి మంచి ఇమేజ్ ఉంది. అయితే ఎందుకనో దర్శకులు మాత్రం అతనితో సరైన కథలు చెప్పలేకపోతున్నారనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. కమర్షియల్ బౌండరీ దాటకండా సినిమాలు చేయడం కోసం గోపీచంద్ కి మైనస్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని కొత్తదనం ఉన్న ఫిక్షనల్ కంటెంట్ పై గోపీచంద్ దృష్టి పెడితే బెటర్ అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. వరుస డిజాస్టర్స్ తో డౌన్ అయిన శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘విశ్వం’ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి కూడా పెద్దగా పాజిటివ్ టాక్ ఏమి రాలేదు.

ఈ సినిమా కలెక్షన్స్ లో కూడా ఆ పాజిటివ్ ఇంపాక్ట్ కనిపించలేదు. 24 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. అయితే కేవలం 10 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ మాత్రమే సినిమాపై జరిగింది. దర్శకుడితో పాటు హీరో కూడా ఫ్లాప్ లో ఉండటంతో ఆ ఇంపాక్ట్ బిజినెస్ మీద పడింది. అయితే ఈ 10 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడానికి కూడా ‘విశ్వం’ మూవీ తంటాలు పడుతోంది.

4 రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వసూళ్లు చేసింది. అందులో 4.40 కోట్ల షేర్ ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంటే ఇంకా 5.60 కోట్ల షేర్ ని లాంగ్ రన్ లో ‘విశ్వం’ మూవీ వసూళ్లు చేయాల్సి ఉంటుంది. వీకెండ్ మూడు రోజులు ఓ మోస్తరుగా కలెక్షన్స్ వచ్చిన నాలుగో రోజైన సోమవారం ఈ మూవీ వసూళ్లు డ్రాప్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో 4వరోజు 58 లక్షల షేర్ అందుకుంటే వరల్డ్ వైడ్ గా 62 లక్షల వరకు కలెక్ట్ చేసింది.

నైజాంలో నాలుగు రోజుల్లో 1.43 కోట్ల షేర్ ని ఈ మూవీ వసూళ్లు చేసింది. ఆంధ్రాలో 2.45 కోట్ల షేర్ అందుకుంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 3.88 కోట్ల షేర్ ని సాధించింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో 52 లక్షల షేర్ ఈ చిత్రానికి వచ్చింది. దీంతో టోటల్ గా 4.40 కోట్ల షేర్ ని 4 రోజుల్లో ‘విశ్వం’ మూవీ కలెక్ట్ చేయగలిగింది. ఇకపై మూవీ ప్రేక్షకులని ఏ మేరకు థియేటర్స్ కి రప్పించగలుగుతుంది అనేదానిపై ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

విశ్వం 4 రోజుల కలెక్షన్స్

నైజాం - 1.43 కోట్లు

ఆంధ్రా - 2.45 కోట్లు

తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ - 3.88 కోట్లు షేర్(6.95 కోట్ల గ్రాస్)

కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా-ఓవర్సీస్ - 52 లక్షలు

టోటల్ కలెక్షన్స్ - 4.40 కోట్లు (8.20 కోట్లు గ్రాస్)

Tags:    

Similar News