గోపిచంద్ విశ్వం.. బాక్సాఫీస్ పరిస్థితేంటి?

మిగిలిన సినిమాలేవీ కూడా ప్రేక్షకులని మెప్పించలేదు. ఒక సాలిడ్ సక్సెస్ కోసం గోపీచంద్ తో పాటు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

Update: 2024-10-14 05:57 GMT

‘లౌక్యం’ తర్వాత ఆ స్థాయిలో సాలిడ్ సక్సెస్ కోసం గోపీచంద్ ఎదురుచూస్తున్నారు. ఆ మూవీ తర్వాత గోపీచంద్ ఇప్పటి వరకు 11 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వాటిలో ‘జిల్’, ‘సిటీమార్’ ఓ మోస్తరుగా ఒకే అనిపించుకున్నాయి. మిగిలిన సినిమాలేవీ కూడా ప్రేక్షకులని మెప్పించలేదు. ఒక సాలిడ్ సక్సెస్ కోసం గోపీచంద్ తో పాటు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

కానీ గోపి ఇమేజ్ కి తగ్గ సినిమా పడటం లేదని చాలా మంది అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా గోపీచంద్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శ్రీనువైట్ల స్టైల్ కమర్షియల్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విశ్వం మూవీ తెరకెక్కింది. ‘ఆగడు’ నుంచి వరుస డిజాస్టర్స్ అందుకున్న శ్రీనువైట్ల కొంత గ్యాప్ తీసుకొని ‘విశ్వం’ మూవీ తెరకెక్కించారు.

సినిమాకి మొదటి రోజు పెద్దగా రెస్పాన్స్ ఏమి రాలేదు. అయితే హీరో, దర్శకుడు ఇద్దరు కూడా ఫ్లాప్ లతో ఉండటం వలన మూవీకి మొదటి రోజు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. వరల్డ్ వైడ్ గా కేవలం 28 వేల టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయంట. మొదటి రోజు టెక్నీకల్ సమస్యల కారణంగా కొన్ని చోట్ల షోలు ఆలస్యంగా పడ్డాయి.

ఇది కూడా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించినట్లు తెలుస్తోంది. అయితే రెండో రోజు 50 వేల వరకు టికెట్స్ తెగాయంట. దీంతో రెండో రోజు కలెక్షన్స్ కొంత పెరిగాయట. ఇక వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ ఏ విదంగా ఉంటాయో చూడాలి. ఇదిలా ఉంటే రెండు రోజుల్లో విశ్వం మూవీ తెలుగు రాష్ట్రాలలో 4.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో 2.40 షేర్ ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 4.45 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయగా అందులో 2.55 కోట్ల షేర్ ఉంది.

అంటే ఓవర్సీస్ లో విశ్వం మూవీ చెప్పుకోదగ్గ విధంగా పెర్ఫార్మ్ చేయలేదని అర్ధమవుతోంది. డైరెక్టర్ గా శ్రీనువైట్ల ట్రాక్ రికార్డ్ తో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ కలెక్షన్స్ అని చెప్పాలి. 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 7.45 కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంటుంది.

విశ్వం 2 రోజుల కలెక్షన్స్

నైజాం - 1.00 కోట్లు

ఆంధ్ర - 1.40 కోట్లు

ఏపీ-టీజీ టోటల్ - 2.40 కోట్ల షేర్ (4.10 కోట్ల గ్రాస్)

కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియన్+ఓవర్సీస్ - 15 లక్షలు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 2.55 కోట్ల షేర్(4.45 కోట్ల గ్రాస్)

Tags:    

Similar News