70ఏళ్ల నటుడితో 31ఏళ్ల నటి డేటింగ్‌లో వాస్తవాలు
వినోద పరిశ్రమ చాలా గ్లామరస్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే పరిశ్రమ రెండో కోణం కూడా ఉంటుందనేది గమనించి తీరాలి.
వినోద పరిశ్రమ చాలా గ్లామరస్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే పరిశ్రమ రెండో కోణం కూడా ఉంటుందనేది గమనించి తీరాలి. ప్రముఖ వెటరన్ నటుడు గోవింద్ నామ్‌దేవ్ దీనికి తాజా ఉదాహరణ. 70 ఏళ్ల గోవింద్ నామ్‌దేవ్ ఇటీవల 31 ఏళ్ల నటి శివంగి వర్మతో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది.
ఆ ఇద్దరూ జంటగా పోజులిచ్చిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తర్వాత డేటింగ్ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ప్రతి ఒక్కరినీ ఒక విషయం ఆకట్టుకుంది. ఈ జంట ఫోటోతో పాటు.. ``ప్రేమకు వయస్సు, పరిమితులు లేవు`` అనే క్యాప్షన్ సందేహాలకు తావిచ్చింది. నిజానికి ఈ ఉపశీర్షిక చదివాక సీనియర్ నటుడితో సదరు నటీమణి డేటింగ్ కి కమిటైందని అంతా భావించారు.
గోవింద్ నామ్‌దేవ్ ఇప్పుడు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాడు. శివంగి వర్మతో తాను రిలేషన్ షిప్‌లో లేనని ధృవీకరించారు. గోవింద్ జీ ఎప్పుడూ సూపర్ కూల్ గా ఉంటారు. తనపై జరిగిన ప్రచారానికి కూల్ నెస్‌ను కోల్పోలేదు. కానీ అభిమానులు గందరగోళానికి గురయ్యారు. అందువల్ల అతడు వివరణ ఇచ్చేందుకు మీడియా ఎదుటకు వచ్చాడు. ``ఇది తన తదుపరి చిత్రానికి సంబంధించిన స్టిల్``అని క్లారిటీనిచ్చాడు.
గోవింద్ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ``ఇది నిజ జీవిత ప్రేమ కాదు.. రీల్ ప్రేమ!`` మేం ఇండోర్ షూటింగ్ లో ఉన్నప్పుడు `గౌరీశంకర్ గోహర్‌గంజ్ వాలే` లొకేషన్‌లో కలిసినప్పటి ఫోటో ఇది. ఈ సినిమా కథాంశం ఆసక్తికరంగా ఉంటుంది.. ఒక వృద్ధుడు ఒక యువ నటితో ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగిందనేది సినిమా కథాంశం.. అని తెలిపారు.