'గుంటూరు కారం'.. త్రివిక్రమ్ పై నెగెటివిటీ.. స్పందించిన నిర్మాత!
మహేష్ వన్ మాన్ షో వల్లే సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయనే వాదనలు సైతం వినిపించాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి ఆట నుంచే ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన చాలామంది ఆడియన్స్ గుంటూరు కారం త్రివిక్రమ్ మార్క్ మూవీ కాదని తేల్చేశారు. సినిమాలో మహేష్ బాబు మాస్ క్యారెక్టరైజేషన్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, డైలాగ్ డెలివరీ అన్ని బాగానే ఉన్నా సినిమాలో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయిందని ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి.
మహేష్ వన్ మాన్ షో వల్లే సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయనే వాదనలు సైతం వినిపించాయి. అయితే ఇదే విషయంపై నిర్మాత నాగ వంశీ తాజా ప్రెస్ మీట్ లో స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు కారం వన్ మ్యాన్ షో మూవీ కాదని చెప్పారు." సినిమాలో మహేష్ బాబు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా అందంగా ఉన్నారు. ఎంతో ఎనర్జిటిక్ గా డాన్సులు చేశారు. కానీ ఇవన్నీ చేయించింది ఎవరు? అని మీడియా వాళ్ళని ప్రశ్నించాడు.
ఇవన్నీ చేయించింది త్రివిక్రమ్ గారు కదా! అలాంటప్పుడు సినిమా వన్ మ్యాన్ షో ఎలా అవుతుంది? అది ఎప్పుడు టూ మేన్ షోనే. స్క్రీన్ మీద కనిపించేది హీరో గారే కదా, డైరెక్టర్ గారు వస్తే బాగోదు కదా" అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. దీంతో నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక గుంటూరు కారం సినిమా విషయానికొస్తే.. డివైడ్ తోనే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ 212 కోట్లు కాబట్టి సినిమా బిజినెస్ లో 90 శాతం రికవరీ చేసింది. సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మహేష్ బాబుకి ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండడంతోనే ఈ కలెక్షన్ సాధ్యమయ్యాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పండగ సీజన్ కావడంతో సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారంకే ఆసక్తి చూపించారు. దాంతో మొదటి వారంలోనే సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం రీజనల్ సినిమాతోనే ఫస్ట్ వీకెండ్ 200 కోట్లు కలెక్ట్ చేయడం టాలీవుడ్లో మరే స్టార్ హీరో కి ఇది సాధ్యం కాలేదు. ఈ అరుదైన ఘనత మహేష్ కి మాత్రమే సొంతమైంది.