గుంటూరుకారం బిజినెస్.. సంక్రాంతి బిగ్గెస్ట్ టార్గెట్

కంప్లీట్ మాస్ కమర్షియల్ జోనర్ లో ఈ సారి త్రివిక్రమ్ మహేష్ బాబుని చూపిస్తున్నాడు.

Update: 2024-01-10 09:04 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. కంప్లీట్ మాస్ కమర్షియల్ జోనర్ లో ఈ సారి త్రివిక్రమ్ మహేష్ బాబుని చూపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఇక థీయాట్రికల్ రైట్స్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 132.6 కోట్ల వరకు జరిగింది. ఏరియా వైజ్ గా చూసుకుంటే నైజాంలో 42 కోట్లకి దిల్ రాజు రైట్స్ సొంతం చేసుకున్నారు.

సీడెడ్ లో 13 కోట్లు, ఉత్తరాంధ్ర 14 కోట్లు, తూర్పుగోదావరి 8.8 కోట్లు, గుంటూరు 7.8 కోట్లు, పశ్చిమ గోదావరి 6.5 కోట్లు, కృష్ణా 6.5 కోట్లు, నెల్లూరు 4 కోట్లు బిజినెస్ ఈ సినిమాపై జరిగింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లోనే 104.1 కోట్ల వరకు రైట్స్ అమ్ముడయ్యాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో 21 కోట్లకి డీల్ సెట్ అయ్యింది.

మొత్తం వరల్డ్ వైడ్ గా 132 కోట్లు వ్యాపారం గుంటూరు కారం సినిమాపై జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 133 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సినిమాపై పాజిటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో ఓపెనింగ్ డే కలెక్షన్స్ కి అయితే కొదవ ఉండదు. తరువాత మౌత్ టాక్ బట్టి సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. సంక్రాంతి లో బిగ్గెస్ట్ మూవీ ఇదే, అలాగే బిగ్గెస్ట్ టార్గెట్ కూడా ఈ సినిమాదే.

సూపర్ స్టార్ మహేష్ బాబు చివరి మూడు సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ మూవీ కూడా స్ట్రాంగ్ హోల్డ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కలిసొస్తే 300 కోట్ల వరకు గ్రాస్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

నైజాం: 42Cr

సీడెడ్: 13.75Cr

ఉత్తరాంధ్ర: 14Cr

ఏపీ తెలంగాణ మొత్తం:- 102.00CR

కర్ణాటక+ROI: 9Cr

ఓవర్సీస్- 20Cr

ప్రపంచవ్యాప్తంగా మొత్తం : 132.00CR

బ్రేక్ ఈవెన్ టార్గెట్ షేర్ - 133 కోట్లు

Tags:    

Similar News