గుంటూరు కారం ఫస్ట్ డే కలెక్షన్స్.. టోటల్ ఎంతంటే..

ఇక గుంటూరులో 4.36 కోట్లు, కృష్ణ ఏరియాలో 2.50 కోట్ల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గుంటూరు కారం సినిమా 38 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

Update: 2024-01-13 09:44 GMT

మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మూడవ సినిమా గుంటూరు కారం శుక్రవారం రోజు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది అని అంచనా వేస్తున్నారు . మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో విడుదలైన సినిమాలలో గుంటూరు కారం కూడా టాప్ లిస్టులో చేరిపోయింది అని అంటున్నారు .

ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఆశ్చర్యాన్ని కలిగించింది. మహేష్ బాబు తన ప్రతి సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద మొదట్లోనే సంచలన రికార్డలను క్రియేట్ చేస్తున్నాడు. టాక్ ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ బాబు సినిమాల కలెక్షన్స్ మాత్రం అసలు తగ్గడం లేదు. ఇక మొదటి రోజు గుంటూరు కారం సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

ఈ సినిమా నైజాం ఏరియాలోనే అత్యధిక స్థాయిలో 16 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా అంచనా కడుతున్నారు. ఇక సిడెడ్ ఉత్తరాంధ్ర ఈస్ట్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక గుంటూరులో 4.36 కోట్లు, కృష్ణ ఏరియాలో 2.50 కోట్ల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గుంటూరు కారం సినిమా 38 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

ఇక కర్ణాటకలో అలాగే రెస్టాఫ్ ఇండియా చూసుకుంటే ఈ సినిమా అటు వైపు నుంచి 2.55 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లో మాత్రం ఊహించని విధంగా 10 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 52 కోట్ల షేర్ కలెక్షన్స్, 79 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. అంటే పెట్టిన పెట్టుబడిలో దాదాపు 40 శాతం ఈ సినిమా వెనక్కి తెచ్చింది.

ఈ సినిమా ఓవరాల్ గా చేసిన థియేట్రికల్ బిజినెస్ 132 కోట్లు కాగా ఇప్పటివరకు వచ్చిన షేర్ కలెక్షన్స్ 52 కోట్లు. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా 80 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ సంక్రాంతి పోటీలో సినిమా ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.

మొదటి రోజు వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ (ఎస్టిమేట్)

ఏపీ తెలంగాణ:- 38 కోట్లు షేర్

కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా:- 2.55 కోట్లు

ఓవర్సీస్: 10.60Cr***

మొత్తం వరల్డ్ వైడ్:- 52 కోట్లు

బ్రేక్ ఈవెన్ - 133 కోట్లు

Tags:    

Similar News