గుంటూరు కారం.. 4రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
మహేశ్ మాస్ ర్యాంపేజ్ ను చూసేందుకు థియేటర్లకు సినీ ప్రియులు క్యూ కట్టారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల షేర్ల వివరాలు ఇలా..
గుంటూరు కారం సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. జనవరి 12న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. కాసుల వర్షం మాత్రం ఆగడం లేదు.
మహేశ్ ఫుల్ మాస్ యాక్షన్ రోల్ లో నటించిన ఈ మూవీ.. తొలి మూడు రోజుల్లో రూ.164 కోట్లకు పైగా వసూలు చేసింది. సోమవారం పండగ రోజు కావడంతో ఈ సినిమాకు బాగానే కలిసి వచ్చింది. మహేశ్ మాస్ ర్యాంపేజ్ ను చూసేందుకు థియేటర్లకు సినీ ప్రియులు క్యూ కట్టారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల షేర్ల వివరాలు ఇలా..
నైజాం - రూ.35.32 కోట్లు
సీడెడ్ - రూ. 9.2 కోట్లు
గుంటూరు - రూ.7.88 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ.7.94 కోట్లు
తూర్పు గోదావరి- రూ.6.71 కోట్లు
కృష్ణ - రూ. 4.88 కోట్లు
పశ్చిమ గోదావరి - రూ.4.37 కోట్లు
నెల్లూరు - రూ. 2.77 కోట్లు
టోటల్ - 79.07
మొత్తంగా గుంటూరు కారం.. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.79.07 కోట్ల షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.175 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నైజాంలో రూ. 42.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.74 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 46.26 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా ఏపీ, తెలంగాణలో రూ.100 కోట్లకు పైగా అమ్ముడైంది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రూ. 132 కోట్లు కాగా.. ఇంకా రూ.50 కోట్లకు పైగా వసూలు చేస్తేనే హిట్ స్టేటస్ పొందుతుంది.
మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన మాస్ అండ్ సెంటిమెంట్ చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. ఈ మూవీని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు.