అల్లుడు మామలా కాదు మహాస్పీడ్!
రెహమాన్ మేనల్లుడిగా జీవి ప్రకాష్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మ్యూజిక్ లెజెండ్ ఏ. ఆర్ . రెహమాన్ ట్యూన్లు తొందరగా ఇవ్వరని, ఎక్కువ సమయం తీసుకుంటారాని, తీసుకున్నా.. చెప్పిన టైమ్ కి ఇవ్వరు? అనే ఓ విమర్శ చాలా కాలంగా ఉన్నది. ఇదే విషయాన్ని రాంగోపాల్ వర్మ పబ్లిక్ గా ఓ ఇంటర్వూలో రెహమాన్ తో తన అనుభవాన్ని పంచుకున్నాడు. తన సినిమాకి ఇవ్వాల్సిన ట్యూన్లు డిలే చేసేసరికి చంపేయాలి! అన్నంత కోపం వచ్చిందన్నారు. అలా వర్మ-రెహమాన్ తో ఉన్న తన బాండింగ్ ను గుర్తు చేస్తున్నారు.
ఆ దెబ్బకి మళ్లీ ఆయనతో వర్మ సినిమాలు చేసింది లేదు. తానేం సినిమా చేసినా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లను ఎంపిక చేసుకోవడం మొదలు పెట్టారు. రెహమాన్ మేనల్లుడిగా జీవి ప్రకాష్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత సంగీత దర్శకుడిగా అటుపై నటుడిగానూ మేకప్ వేసుకున్నాడు. ప్రస్తుతం రెండు రంగాల్లోనూ నటిస్తున్నాడు. ఇలా రెండు రకాలుగా పనిచేయడం అంటే చిన్న విషయం కాదు ఎంతో కసి పట్టుదల ఉంటే తప్ప సాధ్యం కాదు.
అంతేనా ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా అతడి లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. చేతిలో అన్ని సినిమాలు ఉన్నాయి మరి. ఇటీవలే రిలీజ్ అయిన `అమరన్` మంచి విజయం సాధించడంలో జీవి మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ సినిమాకి కూడా సంగీతం అందించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. `అంబరీవ్` చిత్రానికి జీవిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. తమిళ్ లోనే కాదు తెలుగులో పుల్ బిజీగా ఉన్నాడు.
ఇటీవల రిలీజ్ అయిన `లక్కీ భాస్కర్` కి అతడే సంగీతం అందించాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక అతడి లైనప్ చూస్తే `రాబిన్ హుడ్`, `ఇడ్లీ కడాయ్`, `విక్రమ్ `వీర ధూర శూరన్`, `గుడ్ బ్యాడ్ అగ్లీ`కి బీజీఎం అందిస్తున్నాడు. బాలీవుడ్ లో మరో రెండు సినిమాలకు పనిచేస్తున్నాడు. జీవి ఇంత బిజీగా ఉండటానికి మరో కారణం అతడు ట్యూన్లు త్వరగా ఇస్తాడని , దర్శక, నిర్మాతల సమయాన్ని వృద్ధా చేయడని అంటున్నారు. ఫేమస్ అయిన వారంతా ట్యూన్లు ఆలస్యం చేస్తున్నారనే అంతా జీవిని తీసుకుంటున్నారనే ప్రశంస దక్కించుకున్నాడు.