హనుమాన్ 2 రోజుల కలెక్షన్స్.. అస్సలు తగ్గట్లే..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్

Update: 2024-01-14 18:42 GMT

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో ఏకంగా 11 భాషలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన అన్ని భాషలలో హనుమాన్ అద్భుతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంతో షో షోకి బుకింగ్ పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి కలెక్షన్స్ కూడా పుంజుకుంటున్నాయి.

అంచనాల ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజు 8.05 కోట్లు కలెక్ట్ చేస్తే రెండో రోజు ఏకంగా 12.53 కోట్లు వసూళ్లు చేసింది. అంటే 55.65 శాతం పెరుగుదల కనిపించింది. నిజంగా ఇది ఊహించని హైప్ అని చెప్పాలి. దీనిని బట్టి రోజు రోజుకి హనుమాన్ కి ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ పెరుగుతోందని అర్ధమవుతోంది. మొత్తంగా రెండు రోజుల్లో ఇండియాలో 20.58 కోట్లు వసూళ్ళని సాధించగా ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్లుగా ఉందని టాక్.

హనుమాన్ 2 రోజుల కలెక్షన్స్ (షేర్)

ఏపీ తెలంగాణ మొత్తం:- 12.33 కోట్లు

కర్ణాటక:- 2.05 కోట్లు

హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా: 3.25 కోట్లు

ఓవర్సీస్: 6.95 కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్:- 24.58 కోట్లు

ఇక వీకెండ్ తో పాటు సంక్రాంతి సెలవులు కూడా కలిసి రానున్న నేపథ్యంలో కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నార్త్ ఇండియాలో కూడా ఇప్పట్లో హనుమాన్ కి పోటీ ఇచ్చే సినిమాలు ఏవీ రావడం లేదు. జనవరి 25న హృతిక్ రోషన్ పఠాన్ మూవీ రాబోతోంది. అంత వరకు హనుమాన్ స్పీడ్ ని అక్కడ ఎవరూ ఆపలేరు.

కార్తికేయ 2 తర్వాత ఆ స్థాయిలో నార్త్ ఇండియాలో హనుమాన్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా గుంటూరు కారం కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోగా హనుమాన్ కలెక్షన్స్ మాత్రం భారీగా పెరిగాయి. ఈ ఏడాదిలో హనుమాన్ మూవీ చిన్న సినిమాలలో వంద కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ సూపర్ హీరో యూనివర్స్ కథలకి కూడా మున్ముందు మంచి డిమాండ్ ఏర్పడనుంది. పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ ని పెంచుకోవడానికి హనుమాన్ ప్రశాంత్ వర్మకి మంచి బ్యాక్ అప్ గా దొరికింది. ఇక ఈ సినిమా థియేటర్స్ సంఖ్య పెంచాలని సోషల్ మీడియాలో ఆడియన్స్ నుంచి డిమాండ్ వస్తోంది. దీనిపై డిస్టిబ్యూటర్స్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారంట.

Tags:    

Similar News