హనుమాన్ నాటౌట్.. హిందీ బెల్ట్ లో కూడా తోపే!
ఇప్పటికే హనుమాన్ కలెక్షన్స్ విషయంలో పలు రికార్డులు సెట్ చేయగా, చిత్ర యూనిట్ ఈ సక్సెస్ పై చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ, అమెరికాలో కూడా సక్సెస్ టూర్స్ వేశారు.
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవ్వరూ ఊహించని విధంగా అన్ని ఏరియాల్లో పెద్ద హిట్ కొట్టి ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు రాబట్టింది. ప్రస్తుతం ఫుల్ ప్రాఫిట్స్ లో ఉందీ సినిమా. ఇప్పటికే హనుమాన్ కలెక్షన్స్ విషయంలో పలు రికార్డులు సెట్ చేయగా, చిత్ర యూనిట్ ఈ సక్సెస్ పై చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ, అమెరికాలో కూడా సక్సెస్ టూర్స్ వేశారు.
హనుమాన్ సినిమాకు సీక్వెల్ జై హనుమాన్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించారు. సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేస్తే హనుమాన్ సినిమా మాత్రం ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తోంది. 30 రోజుల్లో ఏకంగా 300 సెంటర్స్ లో ఇంకా నడుస్తోంది. విడుదలై నెల రోజులు పూర్తి అయినా.. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది.
ఇక హనుమాన్ మూవీకి హిందీ బెల్ట్ లో కూడా భారీ స్పందన వచ్చింది. తాజాగా అక్కడ ఈ సినిమా రూ.50 కోట్ల నెట్ మార్కును దాటింది. తద్వారా డబ్బింగ్ చిత్రాల లిస్టులో టాప్ 10లోకి చేరింది. ఈ లిస్టులో బాహుబలి 2 రూ. 510.99 కోట్లతో టాప్ లో ఉండగా.. తర్వాత కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, రోబో 2.0, సలార్, సాహో, బాహుబలి 1, పుష్ప, కాంతార మూవీలు ఉన్నాయి. అయితే హనుమాన్ హిందీ వెర్షన్ వసూళ్ల వివరాలను ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆ ప్రకారం..
మొదటి వారం- రూ.22.92 కోట్లు
రెండో వారం- రూ.16.67 కోట్లు
మూడో వారం-రూ.6.47 కోట్లు
నాలుగో వారం- రూ.3.68 కోట్లు
ఐదో వీకెండ్- రూ.1.02 కోట్లు
మొత్తం- రూ.50.76 కోట్లు
సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన హనుమాన్ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ.29.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 30.50 కోట్లుగా నమోదైంది. ఇక 31 రోజుల్లోనే ఈ సినిమాకు రూ.154.69 కోట్లకు పైగా వచ్చాయి. అంటే హిట్ స్టేటస్ తో పాటు రూ.125 కోట్లకుపైగా లాభాలను అందుకుంది హనుమాన్. మరోవైపు, ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో హనుమాన్ సినిమా థియేటర్స్ లో ఇంకెన్ని రోజులు ఆడుతుందో చూడాలి.