హనుమాన్ ప్రీమియర్స్ కు యమా క్రేజ్.. ట్రేడ్ వర్గాలే షాక్!

అలా 50- 50 అంటూ ఏకంగా ఇండియా వైడ్ గా 450కు పైగా ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు. యూఎస్ లో కూడా భారీ స్క్రీన్లలో ప్రీమియర్స్ వేస్తున్నారు.

Update: 2024-01-11 05:22 GMT

ఎక్కడైనా పెయిడ్ ప్రీమియర్స్ అంటే 10-15 షోస్ వేస్తారు.. మరీ కాన్ఫిడెంట్‌గా ఉంటే ఇంకో పాతిక ఎక్స్ ట్రా వేస్తారు. అంతేకానీ ఒకేసారి వందల సంఖ్యలో షోలు వేయడమనేది కనివినీ ఎరగలేదు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని సాధ్యం చేసి చూపించారు హనుమాన్ మూవీ టీమ్. ముందు 50 ప్రీమియర్స్ వేయాలని మేకర్స్ అనుకున్నారట.. కానీ వాళ్లు టికెట్స్ పెట్టిన 10 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ కావడంతో ఇంకో 50 యాడ్ చేశారు.


అలా 50- 50 అంటూ ఏకంగా ఇండియా వైడ్ గా 450కు పైగా ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు. యూఎస్ లో కూడా భారీ స్క్రీన్లలో ప్రీమియర్స్ వేస్తున్నారు. కేవలం తెలుగు చిత్రసీమలో మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంతగా ప్రీమియర్ షోస్ పడిన సినిమా మరొకటి లేదని చెప్పొచ్చు. పైగా అన్ని షోస్ కు టికెట్స్ హౌస్ ఫుల్ కావడంతో దర్శక నిర్మాతలు గాల్లో తేలిపోతున్నారు.

బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి ఓవరాల్ గా వస్తున్న అన్ని సినిమాలతో పోల్చితే చిన్న మూవీ అయినా భారీ బజ్ సొంతం చేసుకుంది హనుమాన్. టీజర్, ట్రైలర్ నుంచే మంచి అంచనాలు నెలకొన్న ఈ మూవీ.. రేపే(జనవరి 12)న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా జనవరి 12 కాదు 11నే విడుదలవుతుందని అనుకోవాలి. ఎందుకంటే అంతలా ప్రీమియర్స్ వేస్తున్నారు మేకర్స్.

ఇండియా వైడ్ గా ఇప్పటికే 383 ప్రీమియర్స్ షోస్ ఫుల్ అవ్వగా.. మరో 76 షోలు ఫిల్ అయిపోతున్నాయి. ఇంకొన్ని షోస్ వేసేందుకు కూడా మేకర్స్ సిద్ధమవుతున్నారు. అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్లకు రూ.లక్షా యాభై వేల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. వీటిని చూసి ఇప్పుడు ట్రేడ్ పండితులు ఆశ్యర్యపోతున్నారు. ఇండస్ట్రీలో ఇలా ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు.

చిన్న హీరో- కొత్త కాన్సెప్ట్.. ఈ రెండు అంశాలు ఉన్నా మేకర్స్ ధైర్యంగా భారీ స్థాయిలో ప్రీమియర్స్ వేయడం షాక్ కు గురిచేస్తుందని అంటున్నారు. తమ సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా.. ఇది మాత్రం గ్రేట్ అని చెబుతున్నారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ కు థియేటర్లు తక్కువగా దొరికాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందు రోజు ప్రీమియర్స్ వేసుకోవడం అనేది మంచి ఆలోచన అని నెటిజన్లు అంటున్నారు.

దానివల్ల మేకర్స్ కు కోటిన్నరకు పైగానే ఆదాయం వచ్చేలా కనిపిస్తోందని చెబుతున్నారు. ఒకవేళ వాళ్ల అదృష్టం బాగుండి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఆ తర్వాత ప్రజలే దాన్ని మోసుకుంటూ వెళ్తారు. ప్రత్యేకంగా ప్రమోషన్స్ అవసరం లేదు. సంక్రాంతి సీజన్ కాబట్టి కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం తర్వాత హనుమాన్ వైపు చూస్తారు. మరి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News