ప్రభాస్ తో సినిమాకైనా ఆయనే కావాలంటున్న హను..!
హను రాఘవపూడి తన తదుపరి సినిమా ను ప్రభాస్ తో చేయబోతున్నా కూడా తాను గతంలో వర్క్ చేసిన సంగీత దర్శకుడిని మాత్రం వదలబోవడం లేదు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ నెలలో సలార్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో కల్కి సినిమా తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలోనే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ను కూడా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇక సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ద్వితీయార్థం లో మొదలు అవ్వబోతుంది. మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.. ఆ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో షురూ అయ్యే విధంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
సీతారామం వంటి సాలిడ్ సక్సెస్ ను క్యూట్ లవ్ స్టోరీతో దక్కించుకున్న హను రాఘవపూడి తన తదుపరి సినిమా ను ప్రభాస్ తో చేయబోతున్నా కూడా తాను గతంలో వర్క్ చేసిన సంగీత దర్శకుడిని మాత్రం వదలబోవడం లేదు.
విశాల్ చంద్ర శేఖర్ తోనే ప్రభాస్ సినిమాకి కూడా సంగీతాన్ని ఇప్పించబోతున్నాడట. మరి ప్రభాస్ వంటి మాస్ పాన్ ఇండియా స్టార్ హీరోకి ఈ సంగీత దర్శకుడు ఎలాంటి సంగీతాన్ని ఇస్తాడో చూడాలి. హను రాఘవపూడి మరియు విశాల్ చంద్ర శేఖర్ మధ్య చక్కని అవగాణ ఉంటుంది.
హను రాఘవపూడి, విశాల్ చంద్రశేఖర్ కాంబోలో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అందుకే ప్రభాస్ కూడా సంగీత దర్శకుడి గా హను ఎంపికను సమర్థిస్తూ ఉన్నాడట. మొత్తానికి ప్రభాస్, హను రాఘవపూడి సినిమాకు సంబంధించిన పనులు ఒకటి ఒకటిగా సాగుతూ వస్తున్నాయి.