'కల్కి' లుక్ మార్చబోతున్న హను..!

ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్న వింటేజ్ లుక్‌ ను సీతారామం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి చూపించే అవకాశాలు ఉన్నాయి

Update: 2024-07-04 01:30 GMT

బాహుబలి తర్వాత వరుసగా భారీ యాక్షన్ సినిమాలను చేసుకుంటూ వస్తున్న ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. దర్శకుడు మారుతి తన రాజాసాబ్‌ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో చూపిస్తానంటూ ఆ మధ్య ప్రకటించాడు. అయితే రాజాసాబ్‌ ఫస్ట్‌ లుక్‌ లో ప్రభాస్ వింటేజ్ లుక్‌ కనిపించలేదు అనే విమర్శలు వచ్చాయి.

ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్న వింటేజ్ లుక్‌ ను సీతారామం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి కాంబోలో ఒక మంచి కమర్షియల్‌ లవ్‌ స్టోరీ మూవీ ఓకే అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ కూడా త్వరలో ప్రారంభం అవ్వబోతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో ప్రభాస్‌ ను చూసిన విధంగా కాకుండా చాలా కొత్తగా, గతంలో ఎలా ఉండేవాడో అలా కనిపించే విధంగా తన సినిమాలో చూపించాలని దర్శకుడు హను రాఘవపూడి ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకు సంబంధించిన లుక్ టెస్ట్‌ కూడ ఆ ప్రారంభం అయ్యింది.

హను రాఘవపూడి హీరోల లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కథకు తగ్గట్లుగా హీరోల పాత్రలను చూపించడంతో పాటు, గెటప్ కూడా అలాగే ఉండే విధంగా ప్లాన్‌ చేస్తాడు. అందుకే ప్రభాస్ ని కూడా కచ్చితంగా ఫ్యాన్స్ కోరుకునే విధంగా వింటేజ్ లుక్‌ లో చూపిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

పీరియాడిక్ లవ్‌ స్టోరీగా రూపొందబోతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ కి సంబంధించిన చర్చలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయి. ఇటీవల వచ్చిన కల్కి సినిమాలో ప్రభాస్‌ యాక్షన్ అవతార్ లో కనిపించాడు. ఇప్పుడు కల్కి కి పూర్తి విభిన్నంగా ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..!

Tags:    

Similar News

eac