ప్రభాస్ యుద్ధం కోసం డైరెక్టర్ రెక్కీ

దర్శకుడు హను రాఘవపూడి సీతారామం హిట్టుతో అసలైన గుర్తింపు అందుకున్నాడు.

Update: 2024-08-22 04:20 GMT
ప్రభాస్ యుద్ధం కోసం డైరెక్టర్ రెక్కీ
  • whatsapp icon

దర్శకుడు హను రాఘవపూడి సీతారామం హిట్టుతో అసలైన గుర్తింపు అందుకున్నాడు. అతను మంచి టాలెంటెడ్ కానీ సాలిడ్ సక్సెస్ రావడానికి సమయం పట్టింది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో డ్రీమ్ ప్రాజెక్టు చేయడానికి సిద్దమవుతున్నాడు. కెరీర్ లోనే మొదటిసారి బిగ్ కాన్వాస్ ఉన్న కథను తెరపైకి తీసుకు వస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాను నిర్మించేందుకు సిద్ధమైంది.


దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తోనే ప్రభాస్ హను సినిమా రూపొందుతున్నట్లు టాక్. ఫౌజీ అనే టైటిల్ చర్చల దశలో ఉంది కాని ఇంకా ఫైనల్ కాలేదు. ఇక దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం సినిమా కోసం లొకేషన్ రెక్కీతో బిజీగా ఉన్నారు. చిత్రయూనిట్ ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది, ఇది ప్రేక్షకులను ఎంతో ఆకర్షించింది.

బ్రిటిష్ పాలన కాలంలో 1940 నాటి కథ నేపథ్యంలో రూపొందబోయే ఈ చిత్రం యుద్ధం నేపథ్యంతో ఉంటుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి భారీ అంచనాలు ఉండగా, హను రాఘవపూడి సాంకేతిక అంశాలను, లొకేషన్‌ను ఎంత ఖచ్చితంగా ఎంచుకుంటారో అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. సినిమాటోగ్రఫర్ సుదీప్ చట్టర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలో హను రాఘవపూడి లొకేషన్ రెక్కీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

సింపుల్ డ్రెస్‌లో అలా టీ తాగుతూ, ఫోన్ లో మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఫిక్షనల్ యుద్ధ కథాంశంతో వస్తుండటంతో, విజువల్స్ చాలా ముఖ్యం అవుతాయి. అందులో భాగంగానే లొకేషన్ ఎంపిక విషయంలో హను ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రభాస్ అభిమానులు కూడా ఈ చిత్రంపై గట్టి అంచనాలు పెట్టుకున్నారు.

ప్రభాస్ నటన, హనురాఘవపూడి ద‌ర్శకత్వ ప్రతిభతో పాటు, సినిమా విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన లొకేషన్లు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి. ఇక సినిమాలో ఇమాన్వి ప్రధాన హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే మరో పాకిస్థాన్ హీరోయిన్ ను కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. హను రాఘవపూడి గత సినిమాలకు ఈ కంపోజర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దీంతో మ్యూజిక్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ అన్ని పనులు అనుకున్నట్లు జరిగితే 2026లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని తెలుస్తోంది.

Tags:    

Similar News