రామ్‌ సినిమా సంక్రాంతి పండుగ అప్డేట్‌

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ సాలిడ్ సక్సెస్‌ని దక్కించుకుని దాదాపుగా ఐదేళ్లు అవుతుంది. అయినా ఆయన క్రేజ్ తగ్గలేదు.

Update: 2025-01-14 03:30 GMT

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ సాలిడ్ సక్సెస్‌ని దక్కించుకుని దాదాపుగా ఐదేళ్లు అవుతుంది. అయినా ఆయన క్రేజ్ తగ్గలేదు. కచ్చితంగా రామ్‌ నుంచి ఒక పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ మూవీ వస్తుంది అనే విశ్వాసంతో చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. రామ్‌ హీరోగా ప్రస్తుతం మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న మహేష్‌ బాబు ఎప్పటిలాగే రామ్‌తో ఒక మంచి సినిమాను తీసేందుకు చాలా రోజులు స్క్రిప్ట్‌ వర్క్ చేశాడు. గత ఏడాదిలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన విషయం తెల్సిందే.

ఈ సినిమాకు వివేక్‌, మార్విన్‌ ద్వయం సంగీతాన్ని అందించనున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. తాజాగా వీరిద్దరు సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్ ప్రారంభించారు. ఈ సంక్రాంతి సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్స్‌ రామ్‌ మూవీ వర్క్ ప్రారంభించినట్లు మైత్రి మూవీ మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. రామ్‌ 22వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగుతున్నారు. సంగీత దర్శకుల విషయంలో చాలా చర్చలు జరిపినట్లు మైత్రి మూవీ మేకర్స్ ద్వారా సమాచారం అందుతోంది. సినిమా కథకు వారు అయితే న్యాయం చేస్తారని దర్శకుడు మహేష్ భావించాడట.

రామ్‌ పోతినేని 2019లో ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి రామ్‌ నటించిన సినిమాలు వస్తున్నాయి కానీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతూ వస్తున్నాయి. ఏడాదికి ఒకటి చొప్పున సినిమా చేస్తున్న రామ్‌కి వరుసగా ఫ్లాప్స్‌ పడ్డాయి. గత ఏడాది చాలా అంచనాలు పెట్టుకుని చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌ సైతం బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో రామ్‌ దాదాపు ఆరు నెలలు గ్యాప్‌ తీసుకుని మహేష్ బాబు దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రామ్‌కు జోడీగా ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ నటిస్తుంది. ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్‌ అయినా అందం విషయంలో మంచి మార్కులు దక్కించుకుంది. అందుకే ఈ అమ్మడు నటిస్తున్న కారణంగా రామ్‌ 22 సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. రామ్‌ కి కచ్చితంగా సక్సెస్‌ కావాల్సిన సమయం ఇది. అందుకే మ్యూజిక్ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్‌ జరుగుతున్న ఈ సమయంలో రామ్‌తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు మ్యూజిక్ డైరెక్టర్స్‌తో ఉన్నట్లు సమాచారం అందుతోంది. రామ్‌కి ఈ సినిమా విజయాన్ని కట్టబెడుతుందా చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News