అవార్డ్ విన్నింగ్ కాంబో.. మళ్లీ గురి పెడుతున్నారా..?
కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు చేసినా సరే వాటికి ఒక సెపరేట్ రేంజ్ ఉంటుంది. ముఖ్యంగా అవార్డ్ విన్నింగ్ కాంబినేషన్ అయితే మాత్రం లెక్క పెట్టి మరీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు
కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు చేసినా సరే వాటికి ఒక సెపరేట్ రేంజ్ ఉంటుంది. ముఖ్యంగా అవార్డ్ విన్నింగ్ కాంబినేషన్ అయితే మాత్రం లెక్క పెట్టి మరీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. ఈ కాంబో సినిమాల మీద ఆడియన్స్ లో కూడా క్రేజ్ ఉంటుంది. కోలీవుడ్ లో అలాంటి క్రేజీ కాంబినేషన్ లు చాలానే ఉన్నాయి. అందులో ధనుష్ వెట్రిమారన్ కాంబో ఒకటి. ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు అవార్డ్ కూడా తెచ్చి పెడుతుంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నా కూడా వెట్రిమారన్ కు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. వెట్రిమారన్ సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ప్రత్యేకమైన సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూ సినీ లవర్స్ ని మెప్పిస్తున్నాడు వెట్రిమారన్. ఐతే ధనుష్ తో వెట్రిమారన్ ఇప్పటికే సినిమాలు చేశాడు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.
వెట్రిమారన్ తో సినిమా చేయాలని కేవలం తమిళ్ హీరోలకే కాదు తెలుగు స్టార్స్ కి ఉంటుంది. ఎన్టీఆర్ కూడా ఆమధ్య వెట్రిమారన్ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉందని అన్నాడు. ఈ కాంబో సెట్ అవుతుందని అనుకోగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ధనుష్ తో వెట్రిమారన్ నెక్స్ట్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఈమధ్యనే విడుదల 2 తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు వెట్రిమారన్.
తన మార్క్ స్టోరీ టెల్లింగ్ తో వెట్రిమారన్ చేస్తున్న సినిమాలు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. అందుకే వెట్రిమారన్ సినిమా అంటే చాలు అందరు అలర్ట్ అవుతారు. ఐతే ఆల్రెడీ సూపర్ హిట్ కొట్టిన కాంబోలో అవార్డ్ విన్నింగ్ సినిమాలు అందించిన ధనుష్ తో మళ్లీ వెట్రిమారన్ జత కట్టడం ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఇక ధనుష్ సినిమాల లైనప్ లో వెట్రిమారన్ ప్రాజెక్ట్ క్రేజీగా మారబోతుంది.
ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా తన సొంత డైరెక్షన్ లో ఇడ్లీ కొడై చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత వెట్రిమారన్ డైరెక్షన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ కాంబో సెట్ అవ్వడం పట్ల ఫ్యాన్స్ కూడా సూపర్ అనేస్తున్నారు. తప్పకుండా వెట్రిమారన్ ఈసారి మరో సంచలనంతో వస్తాడని చెప్పొచ్చు.