న‌టి హ‌నీరోజ్‌పై వేధింపులు.. 30 మందిపై కేసులు..

హనీ రోజ్ ఫిర్యాదు మేరకు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు ఇప్ప‌టికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-01-06 10:11 GMT

ప్ర‌ముఖ బిజినెస్ మేన్ త‌న‌ని వేధిస్తున్నాడ‌ని, ఫేస్‌బుక్‌లో త‌ప్పుడు రాత‌లు రాస్తున్నాడ‌ని ఎన్బీకే 'వీర‌సింహారెడ్డి' క‌థానాయిక హ‌నీరోజ్ తీవ్రంగా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అత‌డు తాను ఎక్క‌డ ఉంటే అక్క‌డికి వ‌చ్చేస్తున్నాడ‌ని, వెంబ‌డిస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సుదీర్ఘ లేఖ‌లో హ‌నీరోజ్ వెల్ల‌డించింది. అత‌డు అస‌భ్య‌క‌ర రాత‌ల‌తో హింసించాడ‌ని ఆరోపించింది. హనీ రోజ్ ఫిర్యాదు మేరకు ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు ఇప్ప‌టికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కొచ్చిలోని కుంబళం ప్రాంతానికి చెందిన షాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, భారతీయ న్యాయ చట్టంలోని లైంగిక వేధింపుల సెక్షన్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద మరో 30 మందిపై కేసు నమోదు చేశారు.


ఫిర్యాదులో హ‌నీ రోజ్ ఫేస్‌బుక్‌లో తాను పెట్టిన పోస్ట్‌కు రిప్ల‌య్ లు ఇస్తూ త‌ప్పుడు రాత‌లు రాసారని పోలీసుల‌కు వెల్ల‌డించారు. తనను ఎఫ్‌.బిలో అనుసరిస్తూనే డబుల్ మీనింగ్ పోస్టుల‌ ద్వారా అవమానించార‌ని.. తాను చర్య‌లు తీసుకోక‌పోతే ఇది ఇలానే కొన‌సాగుతుంద‌ని ఆవేద‌న చెందాన‌ని హ‌నీరోజ్ వెల్ల‌డించారు. తాను అస‌మ‌ర్థురాలిని కాదు గ‌నుకే ఫిర్యాదుకు వెన‌కాడ‌లేద‌ని కూడా అన్నారు.

అత‌డు ఆహ్వానించిన ఫంక్షన్‌లకు వెళ్ళడానికి నేను నిరాకరించినందుకు ప్రతీకారంగా.. ఉద్దేశపూర్వకంగా నేను హాజరయ్యే ఫంక్షన్‌లకు హాజరు కావడానికి ప్రయత్నిస్తాడు. స్త్రీత్వాన్ని అవమానపరిచే విధంగా మీడియాలో నా పేరును వీలైనంత వరకు ప్రస్తావిస్తాడు! అని హ‌నీ రోజ్ ఫిర్యాదులో రాశారు. ఒక వ్యక్తి డబ్బు అహంకారంతో ఏ స్త్రీనైనా అవమానించగలన‌ని అనుకుంటాడా? ఇలాంటి వాటి నుండి భారత న్యాయ వ్యవస్థ ఏదైనా రక్షణ కల్పిస్తుందా? అని ప్ర‌శ్నిస్తే... అతడి దుశ్చ‌ర్య లైంగిక ఆలోచ‌న‌ల‌తో కూడుకున్న‌దని కూడా ఇదివ‌ర‌కూ హ‌నీరోజ్ రాసారు. ఒక వ్యక్తి మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛను అవమానించే స్వేచ్ఛ ఉండదు అని పేర్కొన్నారు.

Tags:    

Similar News