ఏదో కోల్పోయిన భావన.. నటాషా నిరుత్సాహం!
ఇప్పుడు నటాసా మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచే వీడియోను షేర్ చేసింది.
నటాసా స్టాంకోవిచ్ - హార్దిక్ పాండ్యా విడిపోయారనే పుకార్లు చాలా మందిని షాక్‌కి గురి చేశాయి. స్టార్ క్రికెటర్ - సూపర్ మోడల్ జోడీ బంధం నాలుగేళ్లలో విచ్ఛిన్నమైందనే వార్తలు అభిమానులను ఇప్పటికీ కన్ఫ్యూజన్ లోనే ఉంచాయి. ఈ అందమైన జంటకు అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. ఈ జంట నడుమ కలతలున్నాయని, వారి మధ్య అనుబంధం సరిగా లేదనే పుకార్లు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. టీమ్ ఇండియా ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత కూడా ఈ పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. వరల్డ్ కప్ విన్ అయినా కానీ.. నటాసా టీమిండియాకు కానీ.. భర్త హార్దిక్‌కు కానీ అభినందనలు తెలపలేదు. దీంతో ఈ జంట మధ్య అస్సలు బాలేదనే వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. ఇప్పుడు నటాసా మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచే వీడియోను షేర్ చేసింది.
తన ఇన్‌స్టాలో నటాసా 'ఏదో కోల్పోయిన ఫీలింగ్' గురించి మాట్లాడింది. బైబిల్ నుండి ఒక భాగాన్ని షేర్ చేసింది. తాను నిజంగా వినాల్సినవి చదవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పింది. నేను చదివిన దాంట్లో సారాంశం ఇలా ఉంది. భగవంతుడు ఎల్లప్పుడూ ఒక ప్రణాళికను కలిగి ఉంటాడని, ఎవరైనా నిరుత్సాహానికి గురైనప్పుడు, విచారంగా లేదా నిరాశకు గురైనప్పుడు గాడ్ ఎల్లప్పుడూ మనతో ఎలా ఉంటాడో వెల్లడించింది. తాను ఇలా చదివి వినిపించింది. ''ప్రభువు నీకు ముందుగా వెళ్లి నీకు తోడుగా ఉంటాడు.. ఆయన నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు.. భయపడవద్దు, భయపడకుము ..తరచుగా ఓడిపోతావు.. (కానీ) దేవుడు మీతో ఉన్నాడు.. మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారో చూసి అతను ఆశ్చర్యపోడు.. ఎందుకంటే అతడికి ఇప్పటికే ఒక ప్రణాళిక ఉంది'' అని రాసారు నటాషా.
ఈ వ్యాఖ్యల మీనింగ్ ఏమిటి? అంటూ ఇప్పుడు మరోసారి దీనిపై నెటిజనుల్లో చర్చ సాగుతోంది. విడాకుల ఊహాగానాలకు నెటిజన్లు మరోసారి లింక్ పెడుతూ ఊహిస్తున్నారు. టీమిండియా భారీ విజయంపై ఆమె మౌనం వహించడం మాత్రమే కాదు.. ఇప్పుడు నటాషా ఇలా నిరాశను కనబరచడం మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. అంతకుముందు నటాషా తన ఫిట్ సెల్ఫ్‌ను చూపించే కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అభిమానులు ''హార్దిక్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు.... ప్రశంసల పోస్ట్ ఎక్కడ ఉంది..?''అంటూ వ్యాఖ్యానించారు.
హార్దిక్ పాండ్యా - నటాసా స్టాంకోవిచ్ విడిపోయారనే పుకార్లు మీడియా హెడ్ లైన్స్ లోకి వచ్చినప్పటి నుండి, వారి విడాకుల వ్యవహారంపై టన్నుల కొద్దీ ఊహాగానాలు సాగాయి. విడాకులు తీసుకుంటే హార్థిక్ తన ఆస్తిలో 70 శాతం నటాసాకు కోల్పోతాడని పుకార్లు కూడా వచ్చాయి. అయితే నటాసా - హార్దిక్ దీనిపై పూర్తి మౌనం పాటించారు. వారు పుకార్లను ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. వారి ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాల నుంచి పూర్తిగా వైదొలగలేదు.