హరిహర వీరమల్లు.. ఆ దర్శకుడి చేతిలో ఎందుకు పెట్టారో..?

అయితే ఊహించని విధంగా నేడు టీజర్ విడుదల చేసిన మేకర్స్ క్రిష్ తో పాటు మరొక దర్శకుడు పేరుని కూడా హైలెట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది

Update: 2024-05-02 09:53 GMT

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు డైరెక్టర్ విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది అని చాలా రోజులుగా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ బాధ్యతను ఎవరు తీసుకున్న కూడా ప్రాజెక్టు తగ్గట్టుగా న్యాయం చేయడం అనేది అంత మామూలు విషయమైతే కాదనే కామెంట్స్ కూడా ముందే వచ్చాయి. చారిత్రాత్మక కథను డీల్ చేయాలి అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రిష్ వల్లే అవుతుందని కూడా అన్నారు.

అయితే ఊహించని విధంగా నేడు టీజర్ విడుదల చేసిన మేకర్స్ క్రిష్ తో పాటు మరొక దర్శకుడు పేరుని కూడా హైలెట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అది కూడా ఇప్పటివరకు మినిమం సక్సెస్ చూడని జ్యోతి కృష్ణ పేరు ఉండడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జ్యోతి కృష్ణ చిత్ర నిర్మాత ఏఏం రత్నం కుమారుడు. 2003లో తరుణ్ హీరోగా నటించిన 'నీ మనసు నాకు తెలుసు' అనే సినిమా ద్వారా జ్యోతి కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ఆ తరువాత తన తమ్ముడు రవికృష్ణ తోనే కేడి అనే సినిమాను డైరెక్టర్ చేశాడు. అది కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక 2017లో గోపీచంద్ తో ఆక్సిజన్ అనే సినిమా తీశాడు. ఇక రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజనన్ కి కూడా అతనే డైరెక్టర్. ఈ సినిమాల ఫలితాల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

న్యూ డైరెక్టర్ చేసినా కూడా ఫ్యాన్స్ అంతగా టెన్షన్ పడేవారు కాదేమో కానీ ఇప్పటివరకు మినిమమ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయని జ్యోతికృష్ణ ను డైరెక్ట్ చేయడం ఏమిటో అనేలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. ఇక క్రిష్ హఠాత్తుగా అనుష్కతో న్యూ ప్రాజెక్టు స్టార్ట్ చేయడంతో వీరమల్లు పరిస్థితి ఏమిటి అనేది ఎవరికి అర్థం కాలేదు.

ఇక తప్పని పరిస్థితుల్లో నిర్మాత రత్నం 150 కోట్ల ప్రాజెక్టును కొడుకు చేతిలో పెట్టాడు. ఇక రెండు భాగాలుగా అంటున్నారు కాబట్టి మరో భాగాన్ని పూర్తిగా అతనే డీల్ చేసేలా ఉన్నాడు. ఏది ఏమైనా వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే చాలా ప్రత్యేకమైనది. ఇప్పటివరకు అలాంటి జానర్ టచ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ ఆ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

ముఖ్యంగా నిర్మాత ఏఎం రత్నం చాలా కాలం తరువాత ఒక బిగ్ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. కొడుకు రవికృష్ణని హీరోగా చేసి కొన్ని సినిమాలతో నష్టపోగా మరో కొడుకు జ్యోతికృష్ణని డైరెక్ట్ చేసి మరికొంత నష్టపోయారు. అలాంటిది ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఆయన తీసుకున్న రిస్క్ మాములుది కాదు. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News