ఆ డైలాగ్.. హరీష్ శంకర్ బాధ భరించలేకే!
ఇటీవల తెలుగు గడ్డపై దేశ ప్రధాని మోదీతో కలిసి వేదికను షేర్ చేసుకున్న పవన్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడి మనసులను గెలుచుకున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఓవైపు సినీకెరీర్.. మరోవైపు రాజకీయాల్లో కెరీర్ రెండిటినీ శక్తివంచన లేకుండా నడిపించేస్తున్నారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరణంలో అతడు పార్టీ ప్రచార వేదికలపై దుమ్ము దులిపేస్తున్నాడు. ఇటీవల తెలుగు గడ్డపై దేశ ప్రధాని మోదీతో కలిసి వేదికను షేర్ చేసుకున్న పవన్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడి మనసులను గెలుచుకున్నాడు.
ఇంతలోనే అతడు నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో పొలిటికల్ స్టింట్, పవన్ డైలాగులు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమా టీజర్ పొలిటికల్ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. హై ఆక్టేన్ పొలిటికల్ డైలాగ్‌తో కూడిన టీజర్ వస్తోంది అంటూ ముందే ఊరించడంతో ఫ్యాన్స్ నిజంగానే ఎగ్జయిట్ అయ్యారు. జనసేనాని పవర్ ని ఎలివేట్ చేసేలా టీజర్ ను ఎన్నికల సమయంలో విడుదల చేయడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజాగా రిలీజైన టీజర్ లో పవన్ పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు చెప్పారు. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది! అంటూ పవన్ చెప్పే డైలాగ్ జనసైనికుల్లో ఉద్రేకం కలిగిస్తోంది. ``కచ్ఛితంగా గుర్తు పెట్టుకో.. గ్లాసంత సైజ్ కాదు సైన్యం.. కనిపించని సైన్యం!`` అంటూ పవన్ స్ట్రైకింగ్ డైలాగ్ చెప్పారు. మొత్తానికి హరీష్ ఈసారి ఆరడుగుల బుల్లెట్టు లాంటి పవర్ స్టార్ ని పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో చూపిస్తున్నారు. అయితే ఈ డైలాగ్ చెప్పేందుకు పవన్ కి ఎలాంటి ఇబ్బంది కలగలేదా? ఇలాంటి డైలాగులు చెప్పేందుకు అతడు ఆసక్తిగా ఉండడు కదా! అని ప్రశ్నిస్తే దానికి పవన్ నుంచి సమాధానం వచ్చింది.
గాజు గ్లాస్ పై డైలాగ్ తనకు ఇష్టం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ``సినిమాల్లో నాకు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. హరీష్ శంకర్ బాధ భరించలేకే బలవంతంగా చెప్పాను!`` అని పవర్ స్టార్ అన్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దాడు హరీష్. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీష్ జోడీ నుంచి వస్తున్న సినిమాగా దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.