పవర్ హౌస్ లతో మల్టీ స్టారర్… మాస్ డైరెక్టర్ బిగ్ ప్లాన్

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ్ రవితేజ ఇద్దరు పవర్ హౌస్ లాంటి వారు. వీరిద్దరిని స్క్రీన్ పై చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

Update: 2024-08-06 16:57 GMT

కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్ ఆడియన్స్ లో తన సినిమాలతో ఎలా విజిల్స్ వేయించాలి హరీష్ శంకర్ కి బాగా తెలుసు. మిరపకాయ్, గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ సినిమాలు హరీష్ శంకర్ స్టామినా ఏంటో చెబుతాయి. ఇప్పుడు హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీని సిద్ధం చేశారు. ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకి వస్తోంది.

 

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నారు. సినిమాపై కూడా పాజిటివ్ టాక్ ఉంది. తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో హరీష్ శంకర్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. మల్టీ స్టారర్ చిత్రాన్ని ఎవరితో తీయాలని అనుకుంటున్నారు అని అక్కడున్నవారు అడిగారు. దీంతో హరీష్ శంకర్ వెంటనే రవితేజ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ్ రవితేజ ఇద్దరు పవర్ హౌస్ లాంటి వారు. వీరిద్దరిని స్క్రీన్ పై చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. పవర్ స్టార్ అభిమానులలో చాలా మంది రవితేజని ఫాలో అవుతారు. పవన్ కళ్యాణ్ కి కూడా రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం.

అందుకే ఇద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే కచ్చితంగా దానికి నెక్స్ట్ లెవల్ హైప్ వస్తుందని, అలాగే చాలా ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా గురించి చాలా మంది అడుగుతున్నారని హరీష్ శంకర్ తెలిపారు. అది నా చిరకాల కోరిక అని క్లారిటీ ఇచ్చారు.

కచ్చితంగా భవిష్యత్తులో సాధ్యం అవుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. హరీష్ శంకర్ మెగా హీరోలలో ముగ్గురికి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. మెగాస్టార్ తో కూడా మూవీ ఒకే అయిపొయింది. మిస్టర్ బచ్చన్ సక్సెస్ అయితే వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ ని నెక్స్ట్ ఫినిష్ చేస్తారు. ఆ తరువాత మెగాస్టార్ తో హరీష్ శంకర్ మూవీ చేసే ఛాన్స్ ఉంది. హరీష్ శంకర్ ఐదేళ్ల గ్యాప్ తర్వాత మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తోన్న నేపథ్యంలో అతనికి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News