ఆ హీరోయిన్ సక్సెస్ వెనుక మాస్ డైరెక్టర్

స్టార్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

Update: 2024-08-07 06:09 GMT

స్టార్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో మిస్టర్ బచ్చన్ పైన హైప్ ఉంది.


ఈ సినిమాతో నార్త్ ఇండియన్ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. మూవీలో కూడా ఆమెని హరీష్ శంకర్ చాలా గ్లామరస్ గా చూపించినట్లు పాటలను బట్టి అర్ధమవుతోంది. డైరెక్టర్ రాఘవేంద్రరావు తరహాలో భాగ్యశ్రీని సాంగ్స్ లో చాలా అందంగా హరీష్ శంకర్ ఆవిష్కరించారు. అతిలోకసుందరి శ్రీదేవి తర్వాత ఆ స్థాయి అందంతో మరల భాగ్యశ్రీ టాలీవుడ్ ఆడియన్స్ ని మిస్టర్ బచ్చన్ తో మెస్మరైజ్ చేస్తోందనే మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్ లో మిస్టర్ బచ్చన్ వర్కింగ్ స్టిల్స్ పై హరీష్ శంకర్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ స్టిల్స్ లో హీరోయిన్ భాగ్యశ్రీ వెనుక హరీష్ శంకర్ నడుచుకుంటూ వస్తున్నారు. ప్రతి అమ్మాయి సక్సెస్ వెనుక ఒక మగాడు ఉన్నాడని ప్రూవ్ చేయడానికి భాగ్యశ్రీ వెనుక నేను నేను ఉన్నాను అంటూ హరీష్ శంకర్ కామెంట్ చేశారు.

హరీష్ శంకర్ చెబుతున్నట్లే మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కాకుండానే భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ లో పాపులర్ అయిపొయింది. విజయ్ దేవరకొండ VD12, నాచురల్ స్టార్ నాని కొత్త సినిమాలలో ఆమె హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. సాంగ్స్ తో కుర్రకారు మనసులు దోచేసింది. కచ్చితంగా భాగ్యశ్రీ నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మారబోతోందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.

గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ ని హరీష్ శంకర్ స్టార్ హీరోయిన్ గా మార్చేశారు. దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో పూజా హెగ్డేని కూడా స్టార్ ని చేశాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో భాగ్యశ్రీ బోర్సే కూడా కూడా స్టార్ హీరోయిన్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. గద్ధలకొండ గణేష్ తర్వాత హరీష్ శంకర్ ఐదేళ్ళు గ్యాప్ తీసుకొని మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మరి ఈ మూవీ అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News