హరీష్ శంకర్ సర్ ప్రైజ్ సిద్ధమైనట్లే..

తాజాగా హరీశ్ శంకర్ ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. నా ఎగ్జైంట్ మెంట్ ను షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏదో ఉత్సాహం వస్తోందంటూ ఓ ఫొటోను షేర్ చేశారు.

Update: 2023-12-13 14:53 GMT

టాలీవుడ్ సినిమాలను మిగతా సినీ ఇండస్ట్రీల మేకర్స్ రిలీజ్ చేస్తుంటే.. అక్కడి సినిమాలను తెలుగులో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తున్నారు డైరెక్టర్ హరీశ్ శంకర్. బాలీవుడ్ మూవీ దబాంగ్ ను తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టేశారు. తమిళ సినిమా జిగర్తాండను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దల కొండ గణేష్ సినిమా చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.


వేరే భాష సినిమాలను తెలుగులో రీమేక్ చేసి హిట్ సాధించడంలో అందె వేసి చేయిగా ప్రూవ్ చేసుకున్న హరీశ్ శంకర్.. మరో బాలీవుడ్ సినిమాపై కన్నేశారని కొన్ని నెలల క్రితం పుకార్లు షికార్లు చేశాయి. అజయ్ దేవ్ గణ్ నటించిన రైడ్ సినిమాను రవితేజతో హరీశ్ శంకర్ తీయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ అప్పడెవ్వరూ స్పందించలేదు. కానీ ఇప్పుడు హరీశ్ శంకర్ చేసిన ఓ ట్వీట్ తో అదే జరగనుందని తెలుస్తోంది.

తాజాగా హరీశ్ శంకర్ ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. నా ఎగ్జైంట్ మెంట్ ను షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏదో ఉత్సాహం వస్తోందంటూ ఓ ఫొటోను షేర్ చేశారు. అయితే ఆ ఫొటోలో హరీశ్ శంకర్ క్లారిటీ గా కనిపిస్తున్నా.. వెనుక ఇంకా ఇద్దరు వ్యక్తులు లైట్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు హరీశ్ శంకర్ ట్వీట్ ఫుల్ వైరల్ గా మారింది. వెనుక హీరో రవితేజ ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. రైడ్ సినిమా కోసం హీరో టెస్ట్ షూట్ చేసినట్లు ఉందని చెబుతున్నారు.

2018లో అజయ్ దేవగణ్, ఇలియానా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన రైడ్ అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఒక ఊరిలో కోట్ల రూపాయల అక్రమాస్తులు, బ్లాక్ మనీ, ఇల్లీగల్ గా సంపాదించుకొని దాచుకున్న పెద్దమనిషి ఇంటి మీదకు రైడింగ్ కు వెళ్లే ఓ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ కథ ఇది. సూర్య గ్యాంగ్ సినిమాతో పోలికలు ఉంటాయి. అలా చూసుకుంటే సూర్య సినిమా అక్షయ్ కుమార్ స్పెషల్ 26 రీమేకే.

ఇప్పుడు రైడ్ సినిమాను యాజ్ ఇట్ ఈజ్ గా హరీశ్ శంకర్ రీమేక్ చేస్తారా, లేక గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ తరహాలో మార్పులు చేర్పులు చేస్తారా నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే సినిమా ఖరారు అయితే రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఇది తెరకెక్కుతుంది. ఏదేమైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News