హరీష్ శంకర్.. హీరోయిన్ కోసం వేట
ప్రస్తుతం ఓ వైపు స్క్రిప్ట్ పనులు చేస్తూనే మరో వైపు హీరోయిన్ ని ఖరారు చేయడంపై హరీష్ ఫోకస్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.
టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రస్తుతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. వచ్చే ఏడాది జూన్ వరకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమాని రవితేజతో చేయాలని డిసైడ్ అయ్యారంట.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ మూవీ చేయాల్సి ఉండగా బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. దీంతో రవితేజ డేట్స్ దొరకడంతో హరీష్ శంకర్ వెంటనే లైన్ లోకి వచ్చేశారు. బాలీవుడ్ మూవీ రైడ్ ని తన స్టైల్ లో కమర్షియలైజ్ చేస్తూ కంప్లీట్ గా మార్చేసి రవితేజ కోసం సిద్ధం చేస్తున్నారంట. ఈ సినిమా కోసం హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసే పనిలో దర్శకుడు హరీష్ ఉన్నారంట.
ఈ నేపథ్యంలో తన ఫేవరేట్ స్టార్ పూజా హెగ్డేని హరీష్ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డేకి దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో హరీష్ శంకర్ బ్రేక్ ఇచ్చారు. తరువాత ఆమె స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. నిజానికి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కి ఆమెని తీసుకోవాలని అనుకున్నారు. కాని సెట్ కాలేదు. ఇప్పుడు రవితేజ కోసం మాత్రం పూజా హెగ్డేని తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.
ఒక వేళ పూజ హెగ్డే కాదంటే కంప్లీట్ గా న్యూ పేస్ ని పరిచయం చేయాలని అనుకుంటున్నారంట. ప్రస్తుతం ఓ వైపు స్క్రిప్ట్ పనులు చేస్తూనే మరో వైపు హీరోయిన్ ని ఖరారు చేయడంపై హరీష్ ఫోకస్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావొచ్చని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించే ఛాన్స్ ఉందంట.
వీలైనంత వేగంగా స్టార్ట్ చేసి తక్కువ టైంలోనే షూటింగ్ కూడా ఫినిష్ చేసి వచ్చే ఏడాది ఆఖరులో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.