అల్లు అరవింద్ బౌలింగ్ చూశారా..

తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ ఇన్ స్టాగ్రామ్ పేజీలో అల్లు అయాన్, అల్లు అరవింద్ సరదాగా క్రికెట్ ఆడుకుంటున్న వీడియోని పోస్ట్ చేశారు.

Update: 2024-08-12 06:35 GMT

టాలీవుడ్ బడా నిర్మాతలలో టాప్ ప్రొడ్యూసర్స్ లలో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన అల్లు అరవింద్ ప్రస్తుతం తండేల్ సినిమాని చేస్తున్నారు. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. గీతా ఆర్ట్స్ నుంచి మొదటి పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రాబోతోంది. దీని తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాని భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మించబోతున్నారు.

అల్లు అరవింద్ ని అందరూ ఒక బిజినెస్ మెన్ గా, బడా నిర్మాతగానే చూస్తారు. కానీ ఆయనలో యాక్టర్ కూడా ఉన్నాడని గతంలో కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. కెరియర్ ఆరంభంలో అల్లు అరవింద్ నటుడిగా ఒకటి, రెండు సినిమాలు చేశారు. తరువాత నిర్మాతగా గీతా ఆర్ట్స్ భాద్యతలు తీసుకున్న తర్వాత నటనకి స్వస్తి చెప్పి మూవీస్ నిర్మాణం పైన దృష్టిపెట్టారు.

అల్లు అరవింద్ కి మనవడు, మనవరాలు అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే వారితో కలిసి ఇంట్లో కాలక్షేపం చేస్తారంట. అల్లు అర్జున్ పిల్లలైన అల్లు అయాన్, అర్హతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ ఇన్ స్టాగ్రామ్ పేజీలో అల్లు అయాన్, అల్లు అరవింద్ సరదాగా క్రికెట్ ఆడుకుంటున్న వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో అయాన్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే అరవింద్ గారు బౌలింగ్ చేస్తున్నారు.

మనవడికి చాలా ఇష్టంతో ఆయన బౌలింగ్ చేస్తున్నట్లు ఉంది. అలాగే క్రికెట్ మీద అల్లు అరవింద్ కి బాగానే ఇష్టం ఉన్నట్లు ఉందనే మాట ఆ వీడియో చూస్తున్న వారు అంటున్నారు. అంత పెద్ద నిర్మాత అయిన కూడా సింపుల్ గా మనవాడితో సరదాగా క్రికెట్ ఆడుకోవడం నిజంగా గ్రేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎంత పెద్ద వాళ్ళు అయిన తాత, మనవడు రిలేషన్ లో ఉన్న బాండింగ్ వేరుగా ఉంటుందని సరదాగా రియాక్ట్ అవుతున్నారు.

అలాగే అయాన్ కూడా తాత బౌలింగ్ లో సిక్స్ లు కొట్టేందుకే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కొడుకులు ముగ్గురు కూడా వారు కోరుకున్న లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అందుకే అరవింద్ కూడా అన్ని టెన్షన్ లు మరిచిపోయి ఇలా మనవడితో సరదాగా ఇంట్లో క్రికెట్ ఆడుకుంటున్నారనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News