మెగా రూమర్.. ఆ థ్రిల్లర్ సీక్వెల్‌కు హీరో నో ఇంట్రెస్ట్!
దీంతో ఓ కొత్త రూమర్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. ఆ సినిమా హీరోకు నిర్మాతలకు మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయని బయట కథనాలు వస్తున్నాయి.
సినీ పరిశ్రమలోని ఓ బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ యంగ్ హీరో.. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ ప్రమాదం నుంచి కోలుకుని కాస్త గ్యాప్ ఇచ్చి వచ్చిన ఆయన.. ఓ మిస్టీక్ థ్రిల్లర్ సినిమాతో వచ్చి ఊహించని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుని గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. అయితే తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సారి మైథికల్ థ్రిల్లర్ టైమ్ అంటూ రాసుకొచ్చారు.
అయితే ఈ సినిమా దర్శకుడు-నిర్మాణసంస్థ పేరును ప్రకటించారు గానీ హీరో పేరును చెప్పకపోవడం గమనార్హం. దీంతో ఓ కొత్త రూమర్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. ఆ సినిమా హీరోకు నిర్మాతలకు మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయని బయట కథనాలు వస్తున్నాయి. అందుకే ప్రొడ్యూసర్స్ మరో కొత్త హీరో కోసం వెతుకుతున్నారని తెలిసింది.
మొదటి భాగం రిలీజ్ అయ్యాక హీరోకు-నిర్మాతలకు ఈ మనస్పర్థలు తలెత్తాయట. ప్రాఫిట్ షేరింగ్‌లో హీరోకి కావాల్సినంత షేర్‌ను నిర్మాతలు ఇవ్వలేదట. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి.. ఈ రెండో భాగం కోసం జీరో ఇంట్రెస్ట్ కూడా చూపించలేదని తెలిసింది. అందుకో ఈ కొత్త సీక్వెల్ అనౌన్స్మెంట్ హీరో పేరు లేకుండానే పోస్టర్‌ను రిలీజ్ చేశారట మేకర్స్.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఇంకో వార్త కూడా వినిపిస్తోంది. మూవీటీమ్‌కు బాగా దగ్గరైన ఓ ప్రతినిధి.. ఈ సినిమా మొదటి భాగానికి సీక్వెల్ కాదని అన్నారు. ఎందుకంటే ఈ రెండో భాగం కోసం కొత్త హీరోను వెతుకుతున్నారట. అందుకే ఈ చిత్ర కథ వేరేలా ఉండేలా, కనీసం మొదటి భాగం ఫ్రాంచైజీతో కూడా సంబంధం లేకుండా ఉండేలా చూస్తున్నారట. కాకపోతే హీరో తప్ప ఇతర టీమ్ మాత్రం సేమ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదంతా కేవలం హీరోతో వచ్చిన డిఫరెన్సెస్ వల్లే ఇలా చేస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఇకపోతే ఈ మొదటి భాగం హీరో.. ఈ మధ్యే తన కుటుంబానికి చెందిన మరో పెద్ద హీరోతో కలిసి ఓ సినిమాతో బాక్సాఫీస్ ముందు సందడి చేశారు. ఇది మిక్స్డ్ టాక్‌ను అందుకుంది. అయితే ఈ చిత్రం రాజకీయంగా ఎన్నో విమర్శలను, వివాదాలను కూడా ఎదుర్కొంది. సినిమా సోషల్‌మీడియాలో అటు పాజిటివ్‌గా ఇటు నెగటివ్‌గా బాగా ట్రెండ్ అయింది. మరీ రాజకీయ విమర్శల వల్ల ఫ్రీ పబ్లిసిటీని బాగా అందుకుంది.