ఎయిర్‌పోర్ట్‌లో స‌హ‌నం కోల్పోయిన స్టార్ హీరో

సైఫ్ అలీఖాన్ కి మిస్ట‌ర్ కూల్ అన్న పేరుంది. ప‌టౌడీ సంస్థానాధీశుడిగా, స్టార్ హీరోగా గొప్ప స్థాయిలో ఉన్న అత‌డు ఎప్పుడూ విన‌మ్రంగా డౌన్ టు ఎర్త్ ఉంటాడు.

Update: 2024-08-09 14:30 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న పాన్ ఇండియ‌న్ చిత్రం `దేవ‌ర‌`లో సైఫ్ ఖాన్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ తో ఆదిపురుష్ త‌ర్వాత సైఫ్ కి టాలీవుడ్ లో ఇది రెండో సినిమా. సైఫ్ అలీఖాన్ కి మిస్ట‌ర్ కూల్ అన్న పేరుంది. ప‌టౌడీ సంస్థానాధీశుడిగా, స్టార్ హీరోగా గొప్ప స్థాయిలో ఉన్న అత‌డు ఎప్పుడూ విన‌మ్రంగా డౌన్ టు ఎర్త్ ఉంటాడు.

కానీ అందుకు భిన్నంగా ఇటీవల ముంబై విమానాశ్రయంలో క‌నిపించాడు. అత‌డు స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌తో ఊహించని ఘర్షణకు గురయ్యాడు. అతడు టెర్మినల్ వద్దకు రాగానే ఫోటోగ్రాఫర్లు అతనిపై ఎటాక్ చేయడంతో ఇబ్బంది ఫీలైన అత‌డు త‌న స‌హ‌నాన్ని కోల్పోయారు. సైఫ్ మొదట్లో సహకరించినప్పటికీ బెట‌ర్ లైట్ లోకి రావాల్సిందిగా మ‌రోసారి ఫోటోగ్రాఫ‌ర్లు అడ‌గ‌డంతో అతడి సహనం సన్నగిల్లింది. ఈ ప‌రిస్థితికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. సైఫ్ తన చికాకును వ్యక్తం చేస్తూ, ``తో మెయిన్ క్యా కరూ? (నేను ఏం చేయాలి?) అని అన్నాడు. అత‌డి ప్రతిచర్యకు నెటిజ‌నుల‌ నుండి మిశ్రమ ప్రతిస్పందనలు వ‌చ్చాయి. కొందరు అతడి నిరాశ త‌ప్పేమీ కాద‌ని పేర్కొన‌గా, మరికొందరు ఆక‌స్మిక ప్రవర్తనను విమర్శించారు.

నిజానికి ఫోటోగ్రాఫ‌ర్లకు స్టార్ల‌కు మ‌ధ్య అనుబంధం గురించి ఇటీవ‌ల చ‌ర్చ జ‌రుగుతోంది. సెలబ్రిటీలు, మీడియా మధ్య సంబంధాల గురించి జరుగుతున్న చర్చకు ఆజ్యం పోస్తూ గతంలో సైఫ్ మీడియాపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. అయితే సెల‌బ్రిటీల‌ వ్యక్తిగత జీవితాల్లోకి మీడియా ప్ర‌వేశం వారిలో ఒత్తిడిని పెంచుతుంద‌ని ఈ ఘ‌ట‌న వెల్ల‌డిస్తోంది. తాజా సంఘటన సెలబ్రిటీలు, ప్రజల మధ్య సరిహద్దుల గురించి చ‌ర్చ‌ల‌కు దారితీసింది. నిరంతరం మీడియా వెంబ‌డించ‌డం అనేది స్టార్ల‌కు ఇబ్బందిక‌ర‌మైనది. ఈ విష‌యంలో ఇరు వ‌ర్గాలు (సెల‌బ్రిటీలు, మీడియా) ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఆ ఘ‌ట‌న‌ హైలైట్ చేసింది. సోషల్ మీడియాలలో ఇలాంటి ప్ర‌తి విష‌యం వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. సైఫ్ టాలీవుడ్ అరంగేట్రం ఘ‌నంగా కొన‌సాగుతోంది. `దేవర` సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

Tags:    

Similar News