కనురెప్పలు కోల్పోయిన అందాల నటి
హిందీ సినిమా, బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన హీనా ఖాన్ గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధ పడుతోంది.
హిందీ సినిమా, బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన హీనా ఖాన్ గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధ పడుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3 లో ఉందని ఆమె స్వయంగా కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నటిగా, మోడల్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న హీనా ఖాన్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. అంతే కాకుండా తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సైతం ఆమె పంచుకుంటూ వస్తుంది. తాజాగా ఆమె ట్రీట్‌మెంట్ లో భాగంగా తన కంటి రెప్పలు కోల్పోవాల్సి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి తన ఫాలోవర్స్ కి ఆవేదన మిగిల్చింది.
సాధారణంగా క్యాన్సర్ ట్రీట్‌మెంట్ సమయంలో జుట్టు ఊడి పోవడం అనేది కామన్‌గా జరుగుతూ ఉంటుంది. హీనా ఖాన్ స్టేజ్ 3 క్యాన్సర్‌తో బాధ పడుతున్న కారణంగా ఆమె అత్యంత కష్టమైన, కఠినమైన ట్రీట్‌మెంట్‌ను తీసుకుంటూ ఉంది. అందుకే ఆమె గతంలో జుట్టును కోల్పోయింది. ఇప్పుడు తన కన్ను రెప్పలు సైతం కోల్పోయింది. క్యాన్సర్ తో బాధపడుతున్నా రెగ్యులర్‌గా సినిమాల వేడుకల్లో లేదా ఇతర వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఇటీవల ఒక అందమైన చీర కట్టులో కనిపించిన హీనా ఖాన్ వార్తల్లో నిలిచింది.
చీర కట్టుకుని షూ ధరించడం ఏంటి అంటూ కొందరు హీనా ఖాన్ ను విమర్శించిన విషయం తెల్సిందే. అందుకు ఆమె స్పందిస్తూ తాను క్యాన్సర్ కారణంగా చికిత్స తీసుకుంటున్నాను. ఈ సమయంలో తాను షూ మాత్రమే ధరించాల్సి ఉంటుంది. అందుకే తాను చీర కట్టుకుని, ఆ చీర అందం పోగొట్టేలా షూ ధరించాను అంటూ చెప్పుకొచ్చింది. తన ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేదని, అయినా తాను చీర అందం ని పాడు చేసినందుకు క్షమాపణలు కోరుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. చికిత్స చివరి స్టేజ్ లో ఉన్న కారణంగా గత కొన్ని రోజులుగా తాను ఆసుపత్రికే పరిమితం అయ్యానని ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
హీనా ఖాన్ ప్రస్తుతం క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం గురించి, ఆమె పట్టుదల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆమె క్యాన్సర్‌తో బాధ పడుతూ నటించడం, స్టేజ్ షోలు, ఫ్యాషన్ షో ల్లో పాల్గొనడం గొప్ప విషయం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట హీనా ఖాన్ గురించి ఒక గొప్ప వారియర్ అంటూ ప్రశంసలతో అభినందిస్తున్నారు. హీనా ఖాన్ క్యాన్సర్ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి కొత్త జీవితంను ప్రారంభించి, పూర్వ వైభవం సంతరించుకోవాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.