షూస్ వేసుకున్నందుకు క్షమాపణ చెప్పిన ముద్దుగుమ్మ!
తాజాగా తన చీర కట్టు, షూస్ వివాదంపై స్పందించింది. గత కొంత కాలంగా తాను ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.
హిందీ బుల్లి తెర ప్రేక్షకులతో పాటు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన హీనా ఖాన్ ఈ మధ్య కాలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె పంచుకునే ఫోటుల, వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈమె షేర్ చేసిన ఒక ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఆ ఫోటో వల్ల హీనా ఖాన్ విమర్శల పాలు అయింది. ఇలా చేశావు ఏంటి అంటూ చాలా మంది ఈమెను సోషల్ మీడియా ద్వారా విమర్శించడంతో పాటు, కొందరు ఆమెను మీడియా ముందుకు వచ్చి మరీ విమర్శలు చేయడం జరిగింది.
అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఒక ఫ్యాషన్ షో లో హీనా ఖాన్ పాల్గొన్నారు. ఆ షో లో అందమైన బ్రౌన్ టిష్యూ సిల్క్ చీర కట్టుతో మెరిపి పోయింది. ఆమె చీర కట్టుకు ఆమె బాడీ లాంగ్వేజ్ కి భలే సెట్ అయిందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ చీర కట్టు కి హీనా ఖాన్ షూస్ వేసుకోవడం విమర్శలకు తెర తీసింది. అందమైన చీర కట్టుకుని, ఆ చీర అందం పోగొట్టే విధంగా షూస్ వేసుకోవడం ఏంటి అంటూ చాలా మంది ఈమెను విమర్శించడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా ద్వారా చీర కట్టు అందం ను నాశనం చేసినందుకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసిన వారు చాలా మంది ఉన్నారు.
తాజాగా తన చీర కట్టు, షూస్ వివాదంపై స్పందించింది. గత కొంత కాలంగా తాను ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. కనుక కంఫర్ట్ కోసం స్పోర్ట్స్ షూస్ ను ధరించాను అన్నట్లుగా సన్నిహితుల వద్ద చెప్పిందట. షూస్ ధరించడం ద్వారా చీర కట్టు అందం చెడగొట్టినందుకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ హీనా ఖాన్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. హీనా ఖాన్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో కాస్త వివాదం సర్ధుమనిగింది. ఫ్యాషన్ వీక్ లో అందమైన చీర కట్టుతో హీనా ఖాన్ ఆకట్టుకున్న ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం హీనా ఖాన్ స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతుంది. అందుకే హీనా ఖాన్ ఆరోగ్య కారణాల వల్ల షూస్ ధరించిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమయంలోనూ ఆమె చాలా ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాటం సాగిస్తున్నారు. తప్పకుండా ఇందుకు ఆమెను అభినందించాల్సిందే అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమె కు ఈ సమయంలో మద్దతు తెలుపుతున్న వారు కూడా ఉన్నారు. ఆమె షూస్ ధరించినంత మాత్రాన చీర కట్టును అవమానించినట్లు కాదు, అంతే కాకుండా చీర కట్టు అందం నాశనం అవ్వలేదు అనేది చాలా మంది అభిప్రాయం.