నానితో హగ్ హీరోయిన్ కి వింత అనుభూతి!
ఆన్ సెట్స్ లో హీరోలు..హీరోయిన్లు హగ్ చేసుకోవడం..ముద్దులు పెట్టుకోవడం...బెడ్ రూమ్ సన్నివేశాలు లాంటి వాటిలో నటించడం సహజం
ఆన్ సెట్స్ లో హీరోలు..హీరోయిన్లు హగ్ చేసుకోవడం..ముద్దులు పెట్టుకోవడం...బెడ్ రూమ్ సన్నివేశాలు లాంటి వాటిలో నటించడం సహజం. సీన్ డిమాండ్ చేసిందంటే? నటీనటులు ఎలాంటి సన్నివేశా ల్లోనైనా తప్పక నటించాల్సిందే. ఆ సన్నివేశాల వెనుక ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలు దర్శకుడు గానీ.. హీరోయిన్ గానీ..హీరోగాని ఉండవు. కేవలం సన్నివేశం పండటం కోసమే అలా కలిసి నటిస్తుంటారు. కానీ ఇలాంటి సన్నివేశంలో నటించి ఓ వింత అనుభవాన్ని చూసాను అంటోంది మృణాల్ ఠాకూర్ అలియాస్ సీతమ్మ.
ప్రస్తుతం ఈ అమ్మడు నాని హీరోగా నటిస్తోన్న 'హాయ్ నాన్న'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల్లో మరోసారి నేచురల్ స్టార్ తో నేచురల్ పెర్పార్మెర్ తనదైన ముద్ర వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర ప్రశ్న అమ్మడి ముందుకెళ్లింది. ఈ కథలో నటిస్తున్నప్పుడు వ్యక్తిగత భావోద్వేగానికి గురైన సందర్భం ఏదైనా ఉందా? అంటే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 'చాలానే ఉన్నాయి. ట్రైలర్ లో నాని నన్ను హత్తుకునే సన్నివేశం ఉంటుంది కదా. సినిమాలో అది చాలా కీలకమైనది.
దాని కోసం షెడ్యూల్ లో అదనంగా గంటన్నర కేటాయించాల్సి వచ్చింది. భావోద్వేగ ప్రధానమైన సన్నివేశం చేస్తున్నప్పుడు నటులు పాతర్ని అనుభూతి చెందుతూ తమని తాము ప్రేరేపించుకుంటూ నటించాలి. అప్పుడు కానీ భావోద్వేగాలు పండవు. కానీ ఆ సన్నివేశం కోసం కెమెరా ముందుకు వెళ్లగానే అప్రయత్నంగానే ఆ పాత్రలో ఒదిగిపోయాం. భావోద్వేగాలు ప్రవాహంలా అనిపించాయి. ఆ క్షణాలు ఇదివరకూ ఎప్పుడు చూడలేదు.
ఏ సినిమాకి అనుభవించలేదు. ఇలాంటి సందర్భాలు ఇంకా చాలానే ఉన్నాయి. వాటి గురించి చెబితే స్టోరీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకే దాచేస్తున్నా. ఇంకా బలమైన పాత్రలు చేయాలి. మృణాల్ ఠాకూర్ అంటే గుర్తుపట్టకపోయినా పర్వాలేదు. కానీ నేను చేసిన పాత్రలు మాత్రం బలంగా జనాల్లోకి వెళ్లాలి. ఆ పాత్రలు వాళ్ల మనసులో అంత బలంగా నాటుకుపోవాలి' అంది. మొత్తానికి మృణాల్ ఎంపిక చేసుకునే ఏ రోల్ అయినా ప్రేక్షకుల్లోకి ఎంతో బలంగా వెళ్లాలి అని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. 'సీతారామం' తర్వాత రెండవ సినిమా త్వరగా చేయకపోవడానికి కారణం ఇలా బలమైన పాత్ర దొరక్క పోవడమే కావొచ్చు.