నాని అప్పుడు వయొలెంట్‌గా.. ఇప్పుడు రొమాంటిక్‌గా
హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని, ప్రస్తుతం హిట్: ది థర్డ్ కేస్ చేస్తున్న విషయం తెలిసిందే;
నేచురల్ స్టార్ నాని వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాని, ప్రస్తుతం హిట్: ది థర్డ్ కేస్ చేస్తున్న విషయం తెలిసిందే. హిట్ ఫ్రాంఛైజ్ సినిమాల్లో ఒకటిగా వస్తున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. హిట్3లో నాని చాలా వయొలెంట్ పోలీసాఫీసర్ గా అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
Nani with Srinidhi Shetty in Hit 3
నాని తన కెరీర్లోనే మొదటిసారి ఈ సినిమా కోసం పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్, టీజర్ తో హిట్3పై మంచి బజ్ క్రియేట్ అయింది. టీజర్ లోని రక్తపాతం, యాక్షన్ విజువల్స్ సినిమాపై హైప్ ను పెంచడంలో ఎంతగానో దోహదపడ్డాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు చిత్ర మేకర్స్ హిట్3 నుంచి ఓ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మార్చి 24న హిట్: ది థర్డ్ కేస్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రేమ వెల్లువ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ సభ్యులు ముందునుంచే చెప్తున్నారు. ఇక పోస్టర్ విషయానికొస్తే నాని ఇందులో చాలా కూల్ లుక్ లో సింపుల్ గా కనిపిస్తున్నాడు.
ఆల్రెడీ హిట్3 నుంచి రివీల్ చేసిన నాని లుక్ కు భిన్నంగా ఈ లుక్ ఉంది. ముందుగా చాలా వయొలెంట్ గా చూపించిన నాని ఈ పోస్టర్ లో మాత్రం చాలా నార్మల్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా సింపుల్ శారీలో చాలా అందంగా కనిపిస్తోంది. పోస్టర్ చూస్తుంటేనే సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయినట్టే అనిపిస్తోంది.
శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ లో నిర్మిస్తున్నాడు. కోర్టు సినిమా తర్వాత ఈ బ్యానర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో పాటూ హిట్ ఫ్రాంచైజ్ మూవీ అవడంతో హిట్3పై అందరికీ మంచి అంచనాలున్నాయి. హిట్3 మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.